కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు ఆఫీసులు బంద్ అయిపోయి అందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అధిక పని.. ఇంట్లో పెండ్లాం పిల్లల పోరుతో సతమతమవుతున్నారు. ఇంటి నుంచి పని వద్దు మొర్రో అన్నా కంపెనీలు తెరవడం లేదు.
ఈ క్రమంలోనే వర్క్ ఫ్రం హోంపై మీమ్స్, సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఏ పనిచేసినా కుర్చీలో కూర్చొని చేయాల్సి వస్తుందని ఉద్యోగులు బాధపడుతున్నారు.
ఇక పడుకుంటే కూడా రాత్రి కలలోకి కూడా వస్తోందని.. ఇలాగే ఉంటే జీవితం మొత్తం కుర్చీ మయం అవుతుందంటూ వర్క్ ఫ్రం హోమ్ పై మీమ్స్ పెడుతున్నారు.
తాజాగా ఇలాంటి మీమ్స్ కు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సెటైర్లు వేశారు. 'ఆ కుర్చీ ఇప్పుడు నాకు పీడకలగా వచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ ఇలాగే కొనసాగితే జీవితం మొత్తం కుర్చీకే అంకితమవుతుంది. ఆ మీమ్ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక నుంచి నా ఇంట్లో ఉన్న కుర్చీకి.. దాని ఎదురుగా ఉన్న సిస్టమ్‌కు పరిమితి సమయం ఉపయోగిస్తానని మాట ఇస్తున్నా. కానీ ఫ్రొఫెషనల్ వర్క్ చేస్తున్న ఉద్యోగులకు కుర్చీ కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవు' అంటూ కామెంట్ చేశాడు.
ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉద్యోగులు పడుతున్న ఆవేదనకు అద్ధం పడుతోంది.