ప్రముఖ పారిశ్రామిక వేత్త , ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇప్పుడు కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను విధించడంతో , ఆనంద్ మహీంద్రా కూడా లాక్ డౌన్ నియమాలని పాటిస్తూ తన ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటూ ..వాట్సాప్ వండర్ బాక్స్ విశేషాలను పంచుకుంటూ తన అనుచరులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. పలు రకాలైన వీడియోలు, చమత్కారాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ఈ మద్యే లుంగీ గురించి ప్రస్తావించి, అందరిని నవ్వుల్లో ముంచేసిన ఆనంద్ మహీంద్ర తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వాట్సాప్ వండర్ బాక్స్ లో తనను ఆకట్టుకున్న ఇన్ స్టంట్ సూట్ గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ కాలంలో ఇన్ స్టంట్ సూట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ కు త్వరగా ఎలా హాజరుకావచ్చో వివరించే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సూట్ కింద ధరించేందుకు ఈ పెద్దమనిషికి తాను ఒక లుంగీని కూడా పంపించాలనుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.
అలాగే, ఈ లాక్ డౌన్ మనకు చాలా విషయాలను నేర్పింది అని , ముఖ్యంగా మగవాళ్ల హెయిర్ కటింగ్ కష్టాలపై కూడా ఆయన మరో ట్వీట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా జుట్టును ఎలా కత్తిరించుకోవాలని నేర్చుకుంటున్నానని, కానీ జుట్టుని కట్ చేయడం తన వల్ల కావడం లేదంటూ బార్బర్ గొప్పతనాన్ని గుర్తిస్తున్నానని తెలిపారు. దీంతో ఎప్పటిలాగానే ఈయన ట్విట్ పై కమెంట్ల వర్షం కురుస్తుంది. అవసరమే ఆవిష్కరణకు నాంది అని ఒకరు, లుంగీ లేకుండా వర్క్ ఫ్రం హోం చేయడం చాలా బోరింగ్ అని మరొకరు చెప్పుకొచ్చారు.