ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య మందు !

Update: 2021-06-01 12:53 GMT
ఆనందయ్య .. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతోంది. దీనికి కారణం ప్రాణాలు తీసే భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ను కట్టడి చేసే మందు ఈయన తయారుచేయడమే. కరోనా కి ఆనందయ్య మందు సూపర్ గా పనిచేస్తుంది అంటూ ఆ నోటా , ఈ నోటా పడి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి , ఇతర రాష్ట్రాలకి కూడా పాకడంతో , ఆనందయ్య మందు కోసం అందరూ కృష్ణపట్నం వైపు బారులు తీరారు. ఈ సమయంలోనే ఆ మందు కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో అంటూ ప్రభుత్వం మందు పంపిణి ఆపేసి , పలురకాల టెస్టులు చేసిన తర్వాత ఆ మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ మందు కోసం ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే , ఇక్కడే మరో సమస్య పొంచి ఉంది. మందు కోసం జనాలు భారీగా తరలివస్తే , అక్కడ ఏ ఒక్కరికి కరోనా ఉన్నా కూడా మళ్లీ కరోనా సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంది.

దీనితో ప్రభుత్వం ఈ మందు పంపిణీ విషయంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం ఆనందయ్య మందులను వీలైనంత త్వరలో ఆన్ లైన్ ద్వారా పంపిణీ ప్రారంభిస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు.ఆనందయ్య ఇచ్చే మందుల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి జనం భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడం, మరో వైపు కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఇబ్బందులు నివారించేందుకు ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో జనం ఎగబడి వస్తున్నారు.సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడం, చాలా కష్టతరం అని గతంలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆనందయ్య మందుల పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండడం మరో వైపు ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూనే కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేయాలని చెప్పడంతో ఆనందయ్య మందుల తయారీ కూడా సవాల్ గా మారింది. దీనితో ఆన్లైన్ వైపు మొగ్గుచూపుతున్నారు. మందుల తయారీ, పంపిణీ విషయాలపై ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశమై చర్చించారు. కరోనా నిబంధనలు పాటించడం, రద్దీని నివారించే అంశాలపైనే చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ చక్రధర్‌ బాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. మందు తయారీకి కొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పారు.
Tags:    

Similar News