స్టెప్పులేసిన అంబానీ కుటుంబం.. వైరల్ వీడియో..!

Update: 2023-01-20 08:41 GMT
భారత కుబేరుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ముఖేష్ అంబానీ.. నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం విరెన్ మర్చంట్.. శైల దంపతుల కూతురు రాధిక మర్చంట్ తో ఖాయమైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా అనంత్-రాధిక నిశ్చితార్థ వేడుక ముంబాయిలో ఘనంగా జరిగింది.  

ఈ వేడుకలో అతిరథ మహారథులు పాల్గొని సందడి చేశారు. కన్నుల పండుగలా జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అనంత్-రాధిక నిశ్చితార్థం సందర్భంగా అంబానీ కుటుంబ స్టేజ్ పై డాన్సులు చేసి సభికులను అలరించారు.

కాబోయే కోడలిని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ముకేష్ అంబానీ.. నీతా అంబానీ.. ఆకాశ్.. శ్లోకా.. ఇషా.. ఆనంద్ లు స్టెప్పులేయడం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ముందు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా  వీరేన్ మర్చంట్ నివాసానికి వెళ్లి లాంఛనంగా వారిని తమ ఇంటికి ఆహ్వానించింది. తమ నివాసానికి వచ్చిన మర్చంట్ కుటుంబ సభ్యులను అంబానీలు ఘనంగా మర్యాదలు చేశారు. అక్కడి నుంచి అనంత్.. రాధిక శ్రీకృష్ణ మందిరంలో తమ కుటుంబ సభ్యుల ఆశీస్సులు అందుకుని నిశ్చితార్థ వేదికపైకి చేరుకున్నారు.

సాంప్రదాయబద్ధంగా తొలుత విఘ్నేశ్వరుడి పూజలు నిర్వహించి లఘ్నపత్రికను అందరికీ చదివి వినిపించారు. గుజరాతీ సంప్రదాయాలను పాటిస్తూ అంబానీ.. మర్చంట్ కుటుంబ సభ్యులు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం నృత్యాలు చేశారు. ఆపై అంబానీ పెంపుడు శునకం ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురాగా అనంత్, రాధిక ఉంగరాలు మార్చుకున్నారు.

ఈ వేడుకలో రాధిక బంగారు జరీ లెహెంగా ధరించగా.. అనంత్ నేవీ బ్లూ కుర్తా.. డార్క్ హ్యూ జాకెట్ తో దర్శనమిచ్చారు. గురువారం నిశ్చితార్థం వేడుకగా పూర్తి కావడంతో త్వరలోనే ఈ జంట పెళ్లిపీఠలు ఎక్కనున్నారు. ఇక వీరి వివాహం ఈ ఏడాదే జరగనుందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News