బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసి ఎవరు అధికార పీఠం అధిష్టించనున్నారో తేలిపోయింది. అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలువగా.. రెండో స్థానంలో బీజేపీ ఉన్నది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే, ఈసారి కూడా అసెంబ్లీలోకి ప్రవేశించిన వారిలో క్రిమినల్ కేసులున్న వారు కూడా ఉన్నారు. అలాగే కోటీశ్వరులు కూడా ఉన్నారు. ఐతే , గతంలో కంటే ఈ తరహా ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం గమనార్హం. మొత్తం 243 మంది సభ్యులు అసెంబ్లీకి ఎన్నికవగా.. కొత్తగా ప్రవేశించే ఎమ్మెల్యేలలో 55 శాతం అంటే 134 మంది ఎమ్మెల్యేలు కోటిశ్వరులు కావడం విశేషం. గత ఎన్నికల్లో 160 మంది ఎమ్మెల్యేలు లక్షాధికారులు. మునుపటి కంటే ఈసారి అసెంబ్లీకి తక్కువ మంది లక్షాధికారులు వస్తున్నారు. అదేవిధంగా, గతంలో 136 మంది కళంకమైన వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎన్నికవగా.. ఈసారి 165 మంది కళంకమైన ఎమ్మెల్యేలు ఉన్నారు.
కోటీశ్వరులైన ఎమ్మెల్యేల సంఖ్యను చూసినప్పుడు.. బీజేపీ నుంచి గెలిచినవారిలో 42 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆర్జేడీ నుంచి 31 మంది, జేడీయూ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది, ఇతరులు 19 మంది కోటీశ్వరులు ఉన్నారు. కేసుల పరంగా ముందువరుసలో అనంత్ సింగ్ నిలిచారు. ఈయన పై 67 క్రిమినల్ కేసులు ఉన్నాయి.. ఇప్పుడాయన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే. బీహార్లోని మొకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనంత్ సింగ్ విజయం సాధించారు. 2015 ఎన్నికలకు కొద్దిగా ముందు పాట్నాలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఆ సోదాలో ఏకే 47 గన్ తో పాటు ఆరు మ్యాగజైన్లు, రైఫిల్స్, రక్తపు మరకలు అంటిన దుస్తులుబయటపడ్డాయి.. దాంతో కొంతకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది.. జైల్లో ఉండటం ఈయనకు అలవాటే.. కిడ్నాప్, హత్య కేసుల్లో కూడా జైలుకు వెళ్లివచ్చారు అనంత్సింగ్. స్థానిక ప్రజలు ఈయనను చోటే సర్కార్ అని పిల్చుకుంటారు. అనంత్ సింగ్ మొదటిసారి 2005లో మోకామా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2015, 2020 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎన్నికల ఆఫిడవిట్ లో ప్రకటించుకున్న ఆస్తుల మొత్తం విలువ 68.6 కోట్ల రూపాయలు.