పోలీసు ఫైల్స్ లో ఎమ్మెల్సీ అనంత బాబు పేరు మరో విధంగా ఉంది. ఉన్నా కూడా ఆయన ఎక్కడా ఎప్పుడూ తగ్గ లేదు. గతంలో ఆయన గంజాయి రవాణా కేసులో నిందితుడు అని తేలింది. ఇదే మాట పోలీసు దర్యాప్తు కూడా తేల్చింది. అయినా కూడా ఆయనకేం కాలేదు.
తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ఏరియాల్లో తిరిగినంత కాలం ఆయన కొండ కాపు కింద చెలామణీ అవుతారు. ఆ తరువాత రాజకీయం వచ్చేసరికి కాపు సామాజికవర్గం పేరుతో చెలామణీ అవుతారు అన్నది ఆయనపై వినిపిస్తున్న ప్రధాన అభియోగం. ఏదేమయినప్పటికీ ఓ దళితుడి ప్రాణం తీయడం లో ఆయన పాత్ర ఎంతన్నది దర్యాప్తు బృందాలే తేల్చాలి.
ఇదే సమయంలో అనంత బాబు గతం అంత మంచిది కాదు అని గుర్తించాలి. కొత్త పల్లి గీత అనే అరకు మాజీ ఎంపీపై ఆయన దాడికి పాల్పడ్డారన్నది పోలీసు ఫైల్ చెబుతున్న మాట.
ఆ కేసులో జైలుకు పోయి వచ్చారు కూడా !అయినా ఆయనకు అనూహ్యం అనుకునే రీతిలో పదవి వచ్చింది. పోనీ పదవి వచ్చాక అయినా ఆయన మారారా అంటే అదీ లేదు. ఇక దళితుడ్ని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు గతంలో కూడా ఇంతే దురుసుతో ఉన్నారని స్థానికులు అంటున్నారు.
ఏదేమయినప్పటికీ ఆయనకు బొత్స మద్దతు ఉంది అన్నది సుస్పష్టం అని విపక్షం ఆరోపిస్తుంది. అంటే కాపులు ఏకమై ఆయను రక్షగా నిలుస్తారా ? అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.