టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన చలోరే చలోరే చల్ యాత్రపై ఇతర పార్టీల నేతలు బయటికేమీ మాట్లాడకున్నా.. తమ అంతర్గత చర్చల్లో మాత్రం చాలా ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమాత్రం ప్రణాళిక లేకుండానే హడావిడిగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి యాత్రను ప్రారంభించిన పవన్ కల్యాణ్... కరీంనగర్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో తన యాత్రను కొనసాగించిన ఉన్నట్టుండి... ఏపీలోని అనంతపురం జిల్లాలో వాలిపోయారు. పోనీ అక్కడైనా పూర్తి స్థాయిలో యాత్ర చేశారా? అనుకుంటే... అదీ లేదన్న వాదనే వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురంలో సాగిన రూట్లోనే సాగిన పవన్ యాత్ర... నిన్న రాత్రి ధర్మవరంలో ముగిసింది. అయితే ఇక్కడితేనే తాను తన యాత్రను ముగించలేదని, మళ్లీ మళ్లీ అనంతపురానికి వస్తానని - అనంతపురంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చారు. పవన్ మాటలు చూస్తుంటే... రాయలసీమ అంటే ఒక్క అనంతపురం జిల్లా అన్న భావనే కనిపిస్తోందన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన పార్టీ అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలోకి దిగుతారని, అయితే తమకు బలమున్న స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతామని చెప్పిన పవన్... వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తామన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని కూడా పేర్కొన్నారు. ఓ వైపు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటిస్తున్న పవన్... ఆ వెంటనే ఏ పార్టీకి మద్దతు ఇస్తానన్న విషయాన్ని తర్వాత చెబుతానని ప్రకటిస్తుండటం కూడా ఆయనలోని అయోమయ పరిస్థితికి నిదర్శనమన్న వాదన లేకపోలేదు. మొత్తంగా ఓ వారం పాటు అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలోని అనంతపురం జిల్లాలో యాత్ర సాగించి హైదరాబాదులోని ఇంటికి చేరుకున్న పవన్ పై అన్ని వైపుల నుంచి సెటైర్ల మీద సెటైర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పవన్ యాత్ర తీరును పరిశీలించిన వారికి... ఈ యాత్ర జగన్ యాత్రతో వైసీపీ వైపు మళ్లిన జనాన్ని తిరిగి టీడీపీ వైపునకు తిప్పేందుకే పవన్ యాత్ర సాగిందన్న అంచనాకు వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. వెరసి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెర వెనుక ఉండి వ్యూహం రచిస్తుంటే... దానిని తెర ముందు పవన్ రక్తి కట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో నిన్న జగన్ యాత్రకు సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా సాగిన *వాక్ విత్ జగన్* యాత్రలో భాగంగా అనంతలో జరిగిన యాత్రలో పాలుపంచుకున్న అనంతపురం మాజీ ఎంపీ - వైసీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి... పవన్ యాత్రపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ యాత్ర ఉద్దేశమిదేనంటూ సెటైరిక్ గా వెంకట్రామిరెడ్డి చేసిన పంచ్ డైలాగులు బాగానే పేలాయని చెప్పాలి. తెర వెనుక ఉంచి చక్రం తిప్పుతున్న చంద్రబాబు... తెర ముందు దానిని రక్తి కట్టిస్తున్న పవన్... ఇద్దరినీ కలిపేసిన వెంకట్రామిరెడ్డి సినిమాటిక్ డైలాగ్ సంధించారు. చంద్రబాబు సినిమా తీస్తుంటే... అందులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారని ఆయన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి గుండెలు గుభేలుమన్న కారణంగానే... చంద్రబాబు ఇప్పుడు పవన్ ను రంగంలోకి దింపారని ఆయన ఆరోపించారు. అయితే ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. జగన్ ను అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా పవన్ యాత్రకు చంద్రబాబును ముడిపెట్టి వెంకట్రామిరెడ్డి చేసిన పంచ్ లు నిజంగానే పేలాయని చెప్పాలి.