ఆ ఎంపీ స్థానానికి 3 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు!

Update: 2019-03-11 04:47 GMT
లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రెక్క‌డా లేని ఒక ప్ర‌త్యేక‌త ఒక ఎంపీ స్థానంలో చోటు చేసుకోనుంది. ఈ ప్ర‌త్యేక‌త అర్థం కావాలంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలాంటిది ఒక ఎంపీ స్థానం కోసం మూడు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించ‌టం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి. ఇంత‌కీ ఆ ఎంపీ స్థానం ఎక్క‌డ ఉందంటే.. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలోని అనంత్ నాగ్ ఎంపీ స్థానానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది.

ఉగ్ర‌వాద క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉండ‌టం.. అత్యంత సున్నిత‌మైన నియోజ‌క‌వ‌ర్గం కావ‌టంతో మూడు ద‌శ‌ల్లో పోలింగ్ ను నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి లేదు. ఈసారి ప్ర‌త్యేకంగా ఈ ఏర్పాటు చేశారు. క‌శ్మీర్ లోయ‌లో ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉగ్ర‌వాదుల ముప్పు ఎక్కువ‌గా ఉండ‌టంతో భ‌ద్ర‌తా సిబ్బందికి ఎదుర‌య్యే స‌వాళ్ల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.

మొత్తం 6 లోక్ స‌భ స్థానాలు ఉన్న జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలో 5 ద‌శ‌ల్లో పోలింగ్ పూర్తి చేయ‌నున్నారు. ఇదే రీతిలో ఒక రాష్ట్రంలో ప‌లు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్న రాష్ట్రాల్లో ఝూర్ఖండ్.. ఒడిశాలు కూడా నిలిచాయి. 14 ఎంపీ స్థానాలు ఉన్న ఝూర్ఖండ్ లో నాలుగు ద‌శ‌ల్లో.. 21 ఎంపీ స్థానాలు ఉన్న ఒడిశాలోనూ నాలుగు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. గ‌తంలో ఈ రాష్ట్రాల్లో రెండు ద‌శ‌ల్లోనే పోలింగ్ పూర్తి చేసేవారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నాలుగు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హించాల‌ని ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.
Tags:    

Similar News