బుల్లితెరపై యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఒక బుల్లితెర యాంకర్ గా..సినిమాల్లో నటిగానే కాదు.. ఒక మంచి ఫ్యామిలీతో ఇద్దరు పిల్లలు, భర్తతో సరదాగా గడుపుతుంది అనసూయ. తన ఆరోగ్యమే కాదు.. పిల్లల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపుతోంది. వారి బాగోగులు అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది.
ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలను, వ్యక్తిగత సినిమా విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. కేవలం సినిమా విషయాలపైనే కాదు.. ప్రస్తుత సామాజిక పరిస్థితులపై కూడా అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలపై స్పందిస్తుంది.
తాజాగా స్కూల్స్ రీఓపెనింగ్ పై అనసూయ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘కేటీఆర్ సార్.. నాకో డౌట్’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.‘డియర్ కేటీఆర్ సార్.. అసలు లాక్ డౌన్ ఎందుకు వచ్చిందో.. ఆపై అన్ లాక్ కూడా ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. మనందరికీ వ్యాక్సిన్ వేసుకున్నామని కాస్త భరోసా ఇవ్వొచ్చు. అయితే టీకా వేసుకోని పిల్లల సంగతేంటి సార్? పాఠశాలలు తెరిచి పిల్లలను రమ్మని యాజమాన్యాలు బలవంతంచేస్తున్నాయని.. మా పిల్లల బాధ్యత ఎవరిది?’ అని అనసూయ ప్రశ్నించింది.
ఇక స్కూల్లో పిల్లలకు ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యాలు సంతకం చేయించుకుంటున్నాయని అనసూయ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి సార్’ అని ప్రశ్నించారు. మీరు ఎప్పటిలాగానే మాకు సరైన మార్గనిర్ధేశం చేస్తారని ఆశిస్తున్నానని అనసూయ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.