రేపు నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రుకానున్న ప్ర‌దీప్?

Update: 2018-01-09 10:21 GMT
డిసెంబ‌రు 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంక‌ర్ ప్ర‌దీప్ ప‌ట్టుబ‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప్ర‌దీప్ కు నిర్వ‌హించిన బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్టులో 178 పాయింట్లు న‌మోదు కావ‌డం...ఆ స‌మ‌యంలో అత‌డి కారు అద్దాల‌కు బ్లాక్ ఫిలిం ఉండ‌డం....ఆ కారులో మ‌రో యువ‌తి కూడా ఉంద‌ని వార్తలు రావ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌దీప్ నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం నాడు గోషామ‌హ‌ల్ పోలీస్ స్టేష‌న్ లో నిర్వ‌హించిన కౌన్సెలింగ్ కు త‌న తండ్రితో పాటు హాజ‌రయ్యాడు. తనకు షూటింగ్ ఉండటం వల్లే కౌన్సెలింగ్ కు రాలేకపోయానని వివ‌ర‌ణ ఇచ్చాడు. ప్ర‌దీప్ కౌన్సెలింగ్ లో త‌న‌కు అనేక అంశాలు తెలిశాయ‌ని, వాటిని మిగతా వారికి తెలియజేస్తానని ప్ర‌దీప్ చెప్పారు. భ‌విష్య‌త్తులో ఇటువంటి తప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాన‌ని పోలీసులకు తెలిపాడు.
 
అయితే, నిబంధ‌న‌ల ప్ర‌కారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డ్డ‌వారికి  కౌన్సెలింగ్ నిర్వ‌హించిన త‌ర్వాత కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డం ఆన‌వాయితీ. ఆ లెక్క ప్ర‌కారం ప్ర‌దీప్ ను నేడు....నాంప‌ల్లి కోర్టులో హాజ‌రుప‌ర‌చాల్సి ఉంది. అయితే, ప్ర‌దీప్ నేడు కోర్టుకు హాజ‌రుకావ‌డం లేద‌ని తెలుస్తోంది. కౌన్సెలింగ్ నివేదికలో ఆల‌స్య‌మ‌వ‌డంతో ప్రదీప్ ను నేడు కోర్టులో హాజరు పరచేలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. దీంతో, ప్రదీప్ రేపు కోర్టుకు హాజరయ్యే అవకాశ‌ముంద‌ని తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు కారు అద్దాల‌కు బ్లాక్ ఫిల్మ్ ఉప‌యోగించినందుకు ప్రదీప్ పై రెండు కేసులు నమోదయ్యాయి. మ‌రోవైపు  - రేపు ప్ర‌దీప్ కోర్టుకు హాజ‌ర‌వుతాడా లేదా అన్న విష‌యంపై ఉత్కంఠ నెల‌కొంది. వాస్త‌వానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 100 పాయింట్లు దాటిన వారంద‌రికీ కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తుంది. మ‌రి ప్ర‌దీప్  విష‌యంలో ఏం జ‌రుగుతోంద‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. సెల‌బ్రిటీ అయిన ప్ర‌దీప్ కు వార్నింగ్ ఇచ్చి వ‌దిలేస్తారా...లేక చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అంటూ శిక్ష విధిస్తారా అన్నది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News