ఇటీవల కాలంలో వరుస పెట్టి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. తన ప్రజాశాంతి పార్టీ గురించి కబుర్లు చెబుతున్న కేఏ పాల్ పై సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హిందూపురం ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ ఇటీవల ప్రకటించారని..తాజాగా ఆయన తనపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 21 నాటికి పదివేల మంది పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేయాలని చెప్పారని.. అందుకు చాలా సమయం ఉందన్న ఆమె.. విశాఖలో తాజాగా జరిగిన ఒక సమావేశంలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కేఏ పాల్ ను ఉద్దేశించి చాలామంది చాలా చెప్పినా.. మంచివాడన్న నమ్మకంతో ఆయన మాటను కాదనలేదని..కానీ.. తనకు ఇచ్చిన గడువు పూర్తి కాక ముందే.. శ్వేతారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలీదు.. ఆమేం చేస్తున్నారో తెలీదంటూ పాల్ వ్యాఖ్యలు సరికావాన్నారు.
పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కేఏ పాల్ ఒక్కసారిగా తనతో మాట్లాడలేదన్నారు. అలాంటి ఆయన తనను కించపరుస్తూ మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కేఏ పాల్ మాట్లాడే మాటలకు పొంతన ఉండదని.. అలాంటి ఆయన పార్టీ తరఫున పోటీ చేయటంపై తన మిత్రులు తనకు చాలా చెప్పారని.. ఆయన్ను ఓ కామెడీ పీస్ గా విమర్శలు చేశారన్నారు. అయినప్పటికీ తాను పాజిటివ్ గానే కేఏ పాల్ ను చూశానని చెప్పారు.
అలాంటి తనను ఉద్దేశించి.. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా.. తన పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లేలా కేఏ పాల్ వ్యాఖ్యలు చేయటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. దేవుడి పేరుతో కేఏ పాల్ రాజకీయాలు చేస్తున్నారని.. ఇది ప్రమాదకరమన్న ఆమె.. బైపోలార్ డిజార్డర్ తో బాధ పడుతున్నట్లు చెప్పారు.
మైకు పట్టుకున్నప్పటి నుంచి ట్రంప్.. ఒబామా.. హిల్లరీ పేర్లు చెప్పే కేఏ పాల్ మాటలకు చేతలకు సంబంధం ఉందన్నారు. కేఏ పాల్ మాటల్ని క్రిస్టియన్ సోదరులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు. తనపై కేఏ పాల్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాను పార్టీ నుంచి క్విట్ అవుతున్నానని.. ఇకపై తన ప్రస్తావన తెస్తే మంచిగా ఉండదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఎన్ టీవీలో కొంతకాలం.. తర్వాత మరికొన్ని చోట్ల పని చేసిన తనకు కేఏ పాల్ తో గుర్తింపు రాలేదని.. తన గుర్తింపునే కేఏ పాల్ వాడుకున్నారన్నారు. శ్వేతారెడ్డి ప్రెస్ మీట్.. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కేఏ పాల్ ను ఉద్దేశించి ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.