గత కొద్దిరోజులుగా రచ్చ రచ్చగా ఉన్న ఏపీ అసెంబ్లీ శుక్రవారం కామ్‌గా ఉంది. సీట్లు చాలావరకూ ఖాళీగా ఉన్నాయి. పిల్లాజెల్లా లేని పెద్ద ఇల్లు ఎలా ఉందో అచ్చు అలానే ఉంది.
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ శపధం చేయటం.. అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఏపీ అసెంబ్లీలో కేవలం మూడుపార్టీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులో అధికార తెలుగుదేశం ఒకటైతే.. అధికారపక్షానికి భాగస్వామి అయిన బీజేపీ రెండో పార్టీ. మిగిలింది ఏకైన విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
సభలో తమను మాట్లాడనీయకుండా ఉంటూ స్పీకర్ తమ గొంతు నొక్కేస్తున్నారంటూ.. సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. దాని చర్చకు పిలిస్తే తప్ప సభకు రామంటూ శపధం చేసిన జగన్ మాటకు తగ్గట్లే.. విపక్ష సభ్యులు ఏపీ అసెంబ్లీకి హాజరు కాలేదు. దీంతో.. ఉప్పు.. కారం లేని కూరలా ఏపీ అసెంబ్లీ సాగుతోంది.
అధికారపక్ష సభ్యులు మాత్రమే సభలో ఉండటంతో.. సభ చిన్నబోయింది. కాస్తంత హడావుడి.. అరుపులు.. కేకలు ఏమీ లేకుండా.. ఏపీ అసెంబ్లీ సాగుతోంది. ఎంతైనా విపక్షం ఉంటే.. ఆ కళే వేరన్నట్లుగా ఉంది. మరి.. జగన్‌బాబు వెనక్కి తగ్గుతారా? ఏపీ అధకారపక్షం జగన్ మాటకు ఓకే చెబుతుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.