ఏపీ బీజేపీ 123మందితో తొలి జాబితా..

Update: 2019-03-18 04:48 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 123 అసెంబ్లీ సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించింది. పార్లమెంట్ తోపాటు ఆంధ్రప్రదేశ్ - అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 

 ప్రధాని మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం భేటి అయ్యింది. ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు - కార్యదర్శులు - సీనియర్ నేతలు హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ సహా లోక్ సభ తొలివిడత ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ - లక్ష్మన్ హాజరయ్యారు. తెలంగాణ - ఏపీ - త్రిపుర - జమ్మూకాశ్మీర్ - మణిపూర్ రాష్ట్రాల్లోని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ  అభ్యర్థుల విషయానికి వస్తే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఎంపీ బరిలో దింపనున్నారనే అంచనాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ను బీజేపీ ఖరారు చేయలేదు.  పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి మాణిక్యాల రావుకు ఈ జాబితాలో సీటు ఖరారుకాలేదు.

కాగా ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆ రాష్ట్ర ప్రజల దృష్టిలో విలన్ అయిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 123 సీట్లలో బీజేపీ తరుఫున పోటీ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీలు.. బీజేపీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వేళ.. ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రజల మనసులను బీజేపీ ఎలా గెలుచుకుంటుంది.? కనీసం ఒక్క సీటైనా వస్తుందా ఆందోళన రాష్ట్ర కమళనాథుల్లో వ్యక్తమవుతోంది. 2014లో కాంగ్రెస్ కు వచ్చిన పరిస్తితే బీజేపీకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

+ ఏపీలోని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

*శ్రీకాకుళం జిల్లా

ఇచ్ఛాపురం - జేఎస్వీ ప్రసాద్
టెక్కలి - హనుమంతు ఉదయ్ భాస్కర్
పాతపట్నం - రాఘవరావు సాలన
శ్రీకాకుళం - చల్లా వెంకటేశ్వరరావు
ఎచ్చెర్ల - సూర్యప్రకాశ్ రొక్కం
రాజాం - చైతన్య కుమార్ మన్నెమ
పాలకొండ - సునిత తాడంగి

*విజయనగరం జిల్లా

కురుపాం - నిమ్మక జయరాజు
పార్వతీపురం - సురగాల ఉమమహేశ్వరరావు
సాలూరు - ఉదయకుమారి కొండగొర్రి
బొబ్బిలి - డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్
చీపురుపల్లి - శంకర్ లాల్ శర్మ. డి
నెల్లిమర్లి - రమణ. పతివాడ
శృంగవరపుకోట - చల్లా రామకృష్ణ ప్రసాద్

* విశాఖ జిల్లా

భీమిలి - రవీంద్రరెడ్డి మేడపాటి
విశాఖపట్టణం దక్షిణ - కాశీవిశ్వనాథ్ రాజు
విశాఖపట్టణం నార్త్ - విష్ణుకుమార్ రాజు
విశాఖపట్టణం పశ్చిమ - బుద్దా చంద్రశేఖర్
గాజువాక - పులుసు జనార్ధన్
అరకు - ఉమా మహేశ్వరరావు కురుస
పాడేరు - గంథి లోకుల
అనకాపల్లి - పొనగంటి అప్పారావు
పెందుర్తి - కెవివి సత్యనారాయణ
యలమంచిలి - మైలపల్లి రాజారావు
పాయకరావుపేట - కాకర నూకరాజు
నర్సీపట్నం - గాదె శ్రీనివాస్

* పశ్చిమగోదావరి జిల్లా:

కొవ్వూరు - బూసి సూరేంద్రనాథ్ బెనర్జీ
నిడదవోలు - లింగంపల్లి వెంకటేశ్వరరావు
ఆచంట - ఎడ్ల కోదండ చక్రపాణి
పాలకొల్లు - రావుల లక్ష్మణ స్వామి
నర్సాపురం - ఆకుల లీల కృష్ణ
ఉండి - అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు
తణుకు - మల్లిన రాధాకృష్ణ
దెందులూరు - యలమర్తి బాలకృష్ణ
ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్
చింతలపూడి-వై. దుర్గారావు

* తూర్పు గోదావరి జిల్లా:

ప్రత్తిపాడు-చిలుకూరు రామ్‌ కుమార్
పిఠాపురం-బిళ్లకూర్తి రామేశ్వర్ రెడ్డి
కాకినాడ రూరల్-ఎస్‌ కెఎకెఆర్ భీమాశేఖర్ కవికొండల
పెద్దాపురం-యార్లగడ్డ రామ్ కుమార్
ఆనపర్తి-మేడపాటి హరినారాయణరెడ్డి
కాకినాడ సిటీ-రవికిరణ్ పెద్దిరెడ్డి
రామచంద్రాపురం-దూడల శంకర నారాయణ మూర్తి
ముమ్మిడివరం -కర్రి చిట్టిబాబు
అమలాపురం-డాక్టర్ పెయ్యాల శ్యాం ప్రసాద్
రాజోల్-బత్తుల లక్ష్మీకుమారి
గన్నవరం- అయ్యాజీ వేమా మేడపాటి
కొత్తపేట-పాలూరి సత్యానందం
రాజానగరం-ఏపీఆర్ చౌదరి
రాజమండ్రి సిటీ- దత్తు బొమ్ముల
జగ్గంపేట-లక్ష్మీసూర్య నారాయణ రాజు

* కృష్ణా జిల్లా:

జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్
నందిగామ (ఎస్సీ)- జనగం సునీల్ రాజు
మైలవరం- నూతలపాటి బాల కోటేశ్వరరావు
విజయవాడ సెంట్రల్- వామరాజు సత్యమూర్తి
విజయవాడ వెస్ట్- దేశాయ్ పీయూష్
పామర్రు (ఎస్సీ)- వలపర్ల వెంకటేశ్వరరావు
పెడన- మట్టా ప్రసాద్
గుడివాడ- గుత్తికొండ రాజాబాబు
నూజివీడు- మరిది కృష్ణ
తిరువూరు (ఎస్సీ)- పోలే శాంతి

* గుంటూరు జిల్లా:

వినుకొండ- నల్లబోలు వెంకట్రావ్
సత్తెనపల్లి- మద్దాల కృష్ణంరాజు యాదవ్
చిలకలూరిపేట- అన్నం శ్రీనివాసరావు
గుంటూరు ఈస్ట్- నేరేళ్ల సురేశ్
గుంటూరు వెస్ట్- పసుపులేటి లతా మాధవి
ప్రత్తిపాడు (ఎస్సీ)- డాక్టర్ చల్లగాలి కిశోర్
తెనాలి- పాటిబండ్ల రామకృష్ణ
వేమూరు (ఎస్సీ) - దారసానపు శ్రీనివాస్
పొన్నూరు- సీహెచ్. విజయభాస్కర రెడ్డి
మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్ రావు
తాడికొండ (ఎస్సీ)- ఎస్. ఆనందబాబు

* ప్రకాశం జిల్లా:

కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి
మార్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య
కొండెపి (ఎస్సీ)- కరాటపు రాజు
ఒంగోలు- బొడ్డులూరి ఆంజనేయ ప్రసాద్
సంతనూతలపాడు- నన్నెపోగు సుబ్బారావు
పర్చూరు- చెరుకూరి రామ యోగిశ్వరరావు
దర్శి- యెరువ లక్ష్మీ నారాయణ రెడ్డి

* నెల్లూరు జిల్లా:

ఉదయగిరి- గుండ్లవల్లి భరత్ కుమార్
సూళ్లూరుపేట- దాసరి రత్నం
నెల్లూరు సిటి- కె. జగన్‌ మోహన్ రావు
కొవ్వూరు-మారం విజయలక్ష్మీ
ఆత్మకూరు- కామాటి ఆంజనేయరెడ్డి
కావలి- కందుకూరి సత్యనారాయణ

* కడప జిల్లా:

మైదుకూరు- పీవీ ప్రతాప్ రెడ్డి
ప్రొద్దుటూరు- కె బాలచంద్రారెడ్డి
జమ్మలమడుగు- జడ రవి సూర్య రాయల్
రాయచోటి- పి. శ్రీనివాస్ కుమార్ రాజు
కోడూరు- పంతల సురేశ్
కడప- కందుల రాజమోహన్ రెడ్డి
రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు
బద్వేల్- టి. జయరాములు

* కర్నూలు జిల్లా:

ఆలేరు- కోట్ల హరి చక్రపాణి రెడ్డి
ఆదోని- కునిగిరి నీలకంఠ
మంత్రాలయం- జెల్లి ప్రేమ్‌ కుమార్
ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి
కోడుమూరు- మీసాల ప్రేమ్‌ కుమార్
కర్నూలు- వెంకట సుబ్బారెడ్డి
శ్రీశైలం- డాక్టర్ బుద్దా శ్రీకాంత్ రెడ్డి
ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు

* అనంతపురం జిల్లా:

మడకశిర- హనుమంతరాయప్ప
రాప్తాడు- యెర్రిస్వామి
కళ్యాణదుర్గం- ఎం. దేవరాజు
అనంతపురం అర్బన్- జే. అమర్‌ నాథ్
శింగనమల- సి వెంకటేశ్
తాడిపత్రి- జె. అంకాల్ రెడ్డి
గుంతకల్- హరిహరానంద్ పసుపుల
ఉరవకొండ- కొత్త శ్రీనివాసులు
రాయదుర్గం- బీజే వసుంధరా దేవి

*చిత్తూరు జిల్లా:

కుప్పం- ఎన్ఎస్ తులసీదాస్
పలమనేరు- పీసీ ఈశ్వర్ రెడ్డి
పూతలపట్టు- భానుప్రకాశ్
చిత్తూరు- వి. జయకుమార్
గంగాధర నెల్లూరు- పి. రాజేంద్రన్
సత్యవీడు- ఎస్. వెంకటయ్య
శ్రీకాళహస్తి- ఆనంద్ కుమార్ కోలా
చంద్రగిరి- పి. మధుబాబు
పుంగనూరు- మదన్ మోహన్ బాబు గన్నా
మదనపల్లె- బండి ఆనంద్
పీలేరు- పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి
తంబళ్లపల్లె- డి. మంజునాథ్ రెడ్డి
Tags:    

Similar News