రికార్డు చేసిన వాయిస్‌లను కోర్టు ఒప్పకోదంట

Update: 2015-06-10 09:55 GMT
మంగళవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో సింహభాగం చర్చ అంతా ఓటుకు నోటు వ్యవహారంపైనే జరిగినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆడియో.. వీడియో టేపులపై చట్టం ఎలా ఉంటుందన్న అంశంపై కాస్తంత ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఆడియో టేపుల్ని ట్యాప్‌ చేయకుండా.. రికార్డు చేయటం కూడా నేరమేనన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒక మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య విభేదాల కారణంగా భార్య ఫోన్‌కాల్‌ని భర్త రికార్డు చేస్తే అందుకు కోర్టు ఒప్పుకోదని.. గతంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడిందని చెప్పినట్లు సమాచారం.

ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో టేపు విడుదలైన క్రమంలో ఈ చర్చ జరగటం గమనార్హం. తమ టేపుల్ని ట్యాప్‌ చేశారని వాదిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు.. మంత్రివర్గ సమావేశంలో రికార్డు చేస్తే ఏమిటన్న అంశంపై మాట్లాడుకోవటం గమనార్హం.

Tags:    

Similar News