సుప్రీంకు ఏపీ రాజధాని ఇష్యూ

Update: 2015-03-17 10:19 GMT
ఏపీ రాజధాని అంశం సుప్రీం గూటికి చేరింది. తూళ్లురులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఏపీ రాజధానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఏపీ రాజదానికి సంబంధించి ప్రజాప్రయోజన వ్యాజ్యం ఇప్పటికే ఒకటి హైకోర్టులో పెండింగ్‌లోఉండగా.. ఇదే అంశంపై సుప్రీంలో మరో పిల్‌ దాఖలైనట్లయింది. సుప్రీంలో దాఖలైన వ్యాజ్యంలో పచ్చటి పొలాల సేకరణ లాంటి మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని పిటీషనర్‌ ఆరోపించారు. ప్రస్తుతం రాజధాని నిర్మించాలని భావిస్తున్న ప్రాంతంలో వరదల ముప్పు ఉందని వాదించారు. రాజధాని కోసం పచ్చటి పొలాల్నిపణంగా పెడుతున్నారంటూ వాదిస్తున్న వాదనకు సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజా పరిణామం నేపథ్యంలో సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వ్యవసాయ భూముల సేకరణపై సుప్రీం స్పందన ఏపీ రాజధానిపై ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News