మూడు రాజధానులపై సీఎం మౌనం..దేనికి సంకేతం!

Update: 2019-12-26 06:18 GMT
సీఎం జగన్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ..ఒకటికి వంద సార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ ఆ నిర్ణయం లో ఎటువంటి మార్పు ఉండదు అని అందరికి తెలిసిందే. అదే సీఎం జగన్ నైజం. ప్రస్తుతం సీఎం జగన వ్యవహార శైలిని చూసినా ఇదే అర్థమౌతుంది. ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఈ కొద్దీ సమయంలోనే ఎన్నో అనూహ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లిష్ మీడియం అనేది కూడా ఒకటి.

ఈ నిర్ణయం పై ప్రతిపక్షం ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది. అలాగే జనసేన కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. దీనితో సీఎం జగన్ ప్రభుత్వం స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్న వారిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం మీ పిల్లలు - మీ మనవళ్లు ఎక్కడ చదువుతున్నారు? పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుకుంటామంటే మీకెందుకు కడుపుమంట అంటూ అందరికి ఒకేసారి పేరు పేరునా సమాధానం ఇచ్చారు. దీనితో రాష్ట్రం మొత్తం సీఎం జగన్ నిర్ణయాన్నే అందరూ సమర్థించారు, మొదట్లో వ్యతిరేకించిన వారు కూడా చివరకు సమర్థించాల్సి వచ్చింది.

ఇక ఈ సమస్య నుండి ప్రభుత్వం బయటపడింది అనుకున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం జగన్ ..ఎవ్వరు ఊహించని విధముగా ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీన్ని సమర్థించేవారు కొందరు - వ్యతిరేకించేవారు ఇంకొందరు - సవరణలు సూచించేవారు మరికొందరు. రాజధానిని అమరావతిలోని ఉంచాలని .. అమరావతి ప్రాంత ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. వీరికి టీడీపీ మద్దతు ప్రకటించింది. రైతుల పేరుతో చాలామంది రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కొంతమంది సీఎం జగన్ కి జై కొడుతుంటే ..మరికొంతమంది మాత్రం అమరావతిలోని రాజధాని ఉంచాలంటూ మాట్లాడుతున్నారు.  జనసేన మొదట్లో కొన్ని కామెంట్స్ చేసినా కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.

ఇక్కడే సీఎం జగన్ తన రాజకీయ చతురతకి పదును పెట్టారు. ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నవారిపై చెలరేగిన సీఎం జగన్ ..ఈసారి జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. అసెంబ్లీలో మినహా మిగతా ఎక్కడా రాజధాని గురించి కానీ, జీఎన్ రావు కమిటీ నివేదిక గురించి కానీ పెదవి విప్పలేదు. ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వలేదు - ఎవర్నీ విమర్శించనూ లేదు. కానీ , ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోతోంది. అమరావతిని సపోర్ట్ చేస్తున్నవాళ్లంతా ఆటోమేటిక్ గా మిగతా రెండు ప్రాంతాల్లో విలన్లుగా మారిపోయారు. చంద్రబాబుకి తన సామాజిక వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు - తనతో పాటు భూములు కొన్నవారందరికీ భరోసాగా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఆందోళనలకు మద్దతిస్తున్నారు. పవన్ అందుకే వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మీడియా కూడా దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టడంతో సీఎం ఏ కామెంట్స్ చేయకుండా చూస్తూ ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిని పల్లెత్తు మాట అనడంలేదు. కానీ , అమరావతిలోని రాజధాని కావాలి అన్న వారు మిగతా రెండు ప్రాంతాలలో మాత్రం విలన్లు అయిపోయారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే కొంతమందికి అర్థమౌతుండటం తో సైలెంట్ గా వ్యవహారం నుండి బయటకి వస్తున్నారు. ఇలా సీఎం మౌనంగా ఉంటూనే ..వారి పరిస్థితి ఏమిటో వారికే అర్థమయ్యేలా చేస్తున్నారు.
Tags:    

Similar News