సినీ ప్రియులకు ఈ సంక్రాంతి రసవత్తర విందును అందించబోతున్న సంగతి తెలిసిందే. మిగిలిన విషయాలు కాసేపు పక్కనపెట్టి కేవలం సినీ అభిమానులు - సాధారణ ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తే... చిరంజీవి 150వ సినిమా (ఖైదీ నెం.150) - బాలకృష్ణ 100వ చిత్రం (గౌతమి పుత్ర శాతకర్ణి) ఈ సంక్రాంతికి ఒకరోజు తేడాలో ఒకేసారి విడుదల కానున్నాయి. దీంతో ఈ సంక్రాంతి సినిమాల పరంగా పూర్తి ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి. సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - బాలకృష్ణ పోటీపడటం ఒకెత్తు అయితే, ఈ రెండు సినిమాలు వారి వారి ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్స్ కావడం మరోఎత్తు! అయితే ఈ సినిమాల విడుదల విషయంలో ఏపీ పోలీసులు ఒక విషయంపై సీరియస్ గా ఉన్నారు!!
ఈ మధ్యకాలంలో తమ అభిమాన నటుడిపై ఫాజిటివ్ గా కామెంట్స్ చేయడం కంటే, ఇతర నటులపై నెగెటివ్ కామెంట్స్ చేయడం - కొన్ని సందర్భాల్లో అవి శృతిమించి ఉండటం ఎక్కువగా జరుగుతుంది. ఈ అసంబద్ద - అమర్యాదపూర్వక కామెంట్స్ కి సోషల్ మీడియా వేదికవుతుంది. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల విడుదల విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు సీరియస్ గా స్పందించారు. ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసులకు ఆదేశాలు జారీచేసిన డీజీపీ... ఈ సినిమాలపైనా, ఆ హీరోలపైనా ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసినా - వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఈ కామెంట్స్ విషయంలో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడంతో పాటు జైలుకు కూడా పంపే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆయా అభిమాన సంఘాలకు - ఆన్ లైన్ లోని ఫ్యాన్స్ గ్రూపులకు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరికలు జారీచేశారని తెలుస్తుంది.
కాబట్టి ఈ విషయంలో ఆయా అభిమాన సంఘాలు - ఆన్ లైన్ ఫ్యాన్స్ గ్రూపులు ఆచి తూచి ఆయా సినిమాలపైనా, ఆ హీరోలపైనా స్పందించాలి! అలా కాకుండా వారి వారి కామెంట్స్ లో ఏమైనా అమర్యాద కనిపించినా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నా సైబర్ క్రైం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారనే విషయం మరిచిపోకూడదు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/