టీ లో తక్కువే కానీ..టీలో మాత్రం ఏపీ ఎక్కువే?

Update: 2015-08-11 04:38 GMT
విభజన పుణ్యమా అని రెండు రాష్ట్రాల మధ్య తేలాల్సిన పంచాయితీలు చాలానే ఉన్నాయి. విభజన జరిగి 14 నెలలు అవుతున్నా.. ఇప్పటికి తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. ఈ లెక్కల గోల తేలకపోవటంతో ఎప్పటికప్పుడు తరచూ వివాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే.

తాజాగా రెండు రాష్ట్రాల్లోని వైద్య కళాశాల్లో పని చేస్తున్న వారి లెక్క తేలింది. మరి.. ఎక్కడ.. ఏ రాష్ట్రం వారు ఎక్కువ మంది ఉన్నారు..? ఎవరు తక్కువగా ఉన్న విషయాలకు సంబంధించి లెక్కలు తేలిపోయాయి. ఏపీలో తెలంగాణకు చెందిన వైద్యులు పాతికమంది తేలితే.. తెలంగాణలో మాత్రం ఏపీ డాక్టర్లు వందమంది వరకు లెక్క తేలింది.

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ వైద్యుల్లో అత్యధిక భాగం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం పాతికమంది వైద్యుల్లో దాదాపు 13 మంది వైద్యులు వివిధ హోదాల్లో కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేస్తున్నట్లు తేల్చారు మిగిలిన వారు ఒక్కోజిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పని చేస్తున్నారు. నెల్లూరులో నెలకొల్పాల్సిన మెడికల్ కాలేజీలో ఐదుగురు తెలంగాణ వైద్యులు పని చేయటం గమనార్హం.

మరోవైపు తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా వారి లెక్క తేలిస్తే.. మొత్తం వంద మందిలో ఎక్కువ భాగం ఉస్మానియా.. గాంధీ ఆసుపత్రుల్లో ఎక్కువగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం వందలో 60 మంది వరకు వైద్యులు ఈ రెండు ఆసుపత్రుల్లోనే పని చేస్తున్నట్లు తేల్చారు.

 ఇక.. నీలోఫర్.. సరోజిని.. ఛాతీ.. తదితర ఆసుపత్రుల్లో 30 మంది వైద్యులు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి లెక్కలు తేలి.. ఆంధ్రా.. తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వైద్యుల సంఖ్యతో.. ఎవరికి వారు చట్ట ప్రకారం రిలీవ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. వీరిలో ఏ ఒక్కరైనా భిన్నంగా వ్యవహరించినా మరో కొత్త వివాదానికి తెర తీసినట్లే.
Tags:    

Similar News