ఆంధ్రా సరిహద్దుల్లో మిడతల దండు

Update: 2020-05-31 07:58 GMT
ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎలా వస్తున్నాయో తెలియదు కానీ ఉప్పెనలా మీద పడుతున్నాయి మిడతలు.. దండులాగా సాగి పంటలు, చెట్ల ఆకులు తింటూ నాశనం చేస్తున్నాయి. పంటలను నామరూపాల్లేకుండా చేస్తున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వరకూ ఈ మిడతల దండు వచ్చింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో మిడతల దండు దాడి చేసింది. కుప్పం సరిహద్దుల్లోని తమిళనాడు-వేపనపల్లిలో మిడతల దండు ప్రత్యక్షమైంది. రాత్రికి రాత్రే పంటల మీద పడి నాశనం చేశాయి. పచ్చగా కనిపించిన ప్రతీ చెట్టును తినేశాయి.

కుప్పం శివారున విస్తరించిన అరటిచెట్లను మిడతల దండు వదలలేదు. ఏపీలోకి ప్రవేశించి దాడులు చేస్తాయని మిగతా రైతులంతా ఆందోళన చెందుతున్నారు.

అధికారులు రంగంలోకి దిగి ఫెర్టిలైజర్లు చల్లి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన మిడతలు ఇవీ కాదని.. ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నామన్నారు.

ఇక విశాఖపట్నంలోనూ మిడతల దండు కనిపించింది. రోలుగుంట మండలం పడాలపాలెంలో శనివారం చెరుకు తోటల్లోకి ఒక్కసారిగా మిడతల దండు దాచేసింది. ఆకులన్నీ తిని పంటను నాశనం చేశాయి.

   

Tags:    

Similar News