ఏపీలో మందుబాబులు పండుగ చేసుకునే శుభవార్తను ఏపీ సర్కార్ చెప్పింది. కరోనా లాక్ డౌన్ తో మూతబడిన బార్లు తెరిచేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా వైన్ షాపులు - బార్లు బంద్ చేసిన ప్రభుత్వాలు వైన్ షాపులు తెరిచినా బార్లపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని బార్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రేపటి నుంచి బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
బార్ల లైసెన్స్ పై 20శాతం కోవిడ్ ఫీజులు వసూలు చేయనుండగా.. 10శాతం మేర అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది.
ఏపీలో ప్రస్తుతం 840 బార్ల లైసెన్స్ లను 2021 జూన్ 30 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బార్లు తెరుస్తున్నారన్న సమాచారంతో మందుబాబుల్లో జోష్ నెలకొంది. ఇన్నాళ్లు ఏకాంతంగా తాగడానికి ఇబ్బందులు పడ్డ మందుబాబులకు కాస్త ఉపశమనం లభించినట్టైంది.