బీరు బాటిల్ 200 కాబోతుందా?

Update: 2020-05-03 10:30 GMT
కరోనా మందు బాబుల కొంప ముంచింది. ఇప్పటికే కరోనాతో చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. కానీ అప్పు చేసి అయినా మందు బాబులు తాగకుండా ఉండలేరు. ఎన్ని రోజులు అయినా లాక్ డౌన్ పెట్టుకోండి. కానీ వైన్ షాపులు మాత్రం ఓపెన్ చేయండి అంటూ దేబిరిస్తున్నారు. అసలు మందుబాబులు పై ఈ 40 రోజులు లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రులకే చాలా మంది రిక్వెస్టులు పెట్టారు. పాపం రాంగోపాల్ వర్మ కేటీఆర్ ను రిక్వెస్ట్ చేసి గట్టిగా రిటర్న్ పంచ్ వేయించుకున్నారు. ఎట్టకేలకు మందు బాబుల కల ఫలించింది. వైన్ షాపులు తెరవడానికి కేంద్రం ఓకే చెప్పేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు షాక్ మొదలు.

ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కంటైన్ మెంట్ జోన్స్ మినహా మిగతా ప్రాంతాల్లో వైన్స్ ఓపెన్ చేస్తున్నారు. కానీ మీకు ఒకటి కాదు... రెండు మూడు షాక్ లున్నాయక్కడ. 40 రోజుల క్రితం రేట్లు వేరు. ఇపుడు వేరు. కొత్త రేట్లు డిసైడ్ చేశారట ఏపీలో. 25 శాతం తగ్గకుండా రేట్లు పెంచుతున్నారట. రేపు ఉదయం నుంచి ఈ కొత్త రేట్లతోనే మద్యం అమ్మకాలు ప్రారంభం అవుతాయి. అంటే కరోనా మన ఆదాయం తగ్గించడమే కాదు - మన ఖర్చును కూడా పెంచింది. బీరు బాటిల్ అయితే ఏకంగా 200 ఉంటుందని చెబుతున్నారట. మొత్తానికి మద్యం ధరలు చుక్కలనంటుతున్నాయి అనుకుంటున్నారు.

ఇక మీరు చేతిలో డబ్బులు పెట్టుకుని ఊపుకుంటూ పోతే మందు ఇస్తారు అనుకుంటున్నారేమో - మొహానికి మాస్కు ఉంటేనే మందు అమ్ముతారు. ఎగబడి కొనే పరిస్థితి ఉండదు. మనిషికి మనిషికి ఒకటిన్నర మీటరు దూరం పాటించాల్సిందే. ఆ సామాజిక దూరం పాటించకపోతే మీకు మందు దొరకదు. అంటే రేపట్నుంచి మందు సంపాదించడానికి ఒక యుద్ధానికి సిద్ధమయినట్లు అవ్వాలన్నమాట. పాపం తమకు డబ్బులిచ్చే వారికి కూడా ప్రభుత్వం ఇన్ని కష్టాలు పెడితే ఎలాగ? దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాలి.
  



Tags:    

Similar News