ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ తొలగింపు!

Update: 2020-04-10 11:41 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మరో  సంచలన నిర్ణయం తీసుకుంది.  ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ కు ఉద్వాసన పలికింది. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్‌ ను తొలగిస్తూ జీవో జారీ చేసినట్టు సమాచారం. ఏపీ ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనల మార్పు ఆర్డినెన్స్‌ కు గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఆ వెంటనే ఆర్డినెన్స్‌ పై జీవో జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది. దీనితో  ప్రభుత్వానికి వచ్చిన అధికారంతో  రమేశ్ ‌కుమార్‌ ను ఎన్నికల కమిషనర్ గా తొలగిస్తూ జీవో జారీ చేసింది. 

ఏపీలో గత నెల 21 - 23 - 27 - 29 తేదీల్లో జరగాల్సిన జెడ్పీటీసీ - ఎంపీటీసీ - మున్సిపల్ - గ్రామ పంచాయతీ సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సామాజిక వర్గం నేత అయిన చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారంటూ సీఎం జగన్ సంచలన ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News