ఆంధ్రప్రదేశ్ లోని ఆస్పత్రిలోకి ఎలుకలు వస్తాయి. చిన్నారులను కొరుక్కు తింటాయి. దాంతో ఎలుకలను పట్టేస్తారు. ఎలుకలు లేకపోవడంతో అప్పటి వరకు వాటిని తిన్న పాములు బయటకు వస్తాయి. సాక్షాత్తూ ఆపరేషన్ థియేటర్ లోకే పాములు చొచ్చుకు వస్తాయి.
ఇక తెలంగాణలో గర్భం దాల్చకపోయినా డాక్టర్లు గర్భిణిగా పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. ప్రసవ తేదీలు కూడా ఇచ్చేస్తారు. ఆస్పత్రి ముందే రోగులను చంపేస్తారు.
.. నవ్యాంధ్ర అయినా.. తెలంగాణ అయినా ఆస్పత్రుల్లో దారుణాలు మామూలే. కొత్త రాష్ట్రం వచ్చినా.. పాత ముఖ్యమంత్రి మళ్లీ వచ్చినా అవి అలా జరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపడానికి ఎవరూ సాహసించరు. వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకోరు.
ఎందుకంటే.. ఆస్పత్రుల్లో దారుణాలు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటాయి. అందరికీ ఒకేసారి జరగవు. అందరికీ ఒకేసారి జరిగితే అది ఒక ఆందోళన రూపం సంతరించుకుంటుంది. కానీ, ఒక్కొక్కరికి జరుగుతూ ఉంటే దానిని ఎవరు పట్టించుకుంటారు. ఎవరికో అన్యాయం జరిగితే మిగిలిన వారు ఎందుకు స్పందిస్తారు. పేపర్లో వార్త చదివి అయ్యో అని వదిలేస్తారు. అందుకే ప్రభుత్వాలు కూడా ఆస్పత్రులను పట్టించుకోవడం లేదు.
నవ్యాంధ్రలో ఎలుకలు కొరికి చిన్నారి చనిపోతే అక్కడి మంత్రి ఒక నర్సు మీద చర్యలు తీసుకుని మరో డాక్టర్ ను బదిలీ చేయడానికి ప్రయత్నించారు. అంతే డాక్టర్లంతా ఏకమై దానిని నిలుపు చేయించారు. డాక్టర్లు, నర్సుల దెబ్బకు మంత్రి కూడా దిగి రాక తప్పలేదు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డుల విషయంలో ఆస్పత్రుల డిమాండ్లకు ప్రభుత్వాలు దిగి రాక తప్పడం లేదు. ఆస్పత్రుల్లో డాక్టర్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రశ్నించడానికి వీల్లేదు. చర్యలు తీసుకునే సాహసాన్ని ప్రభుత్వాలు చేయడం లేదు. వెరసి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైద్యం ఒక మాఫియాగా మారుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వాలనే శాసించినా ఆశ్చర్యం లేదు.