హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలివెళ్లనున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికత కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. జూన్ 2లోగా అంతా కొత్త రాజధానికి వెళ్లాలంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్థానికతపై కూడా దృష్టి సారించింది. దీనిపై రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర హౌంశాఖకు తుది ప్రతిపాదనలను పంపించారు. స్థానికత విషయంలో ఉద్యోగుల కోరిక మేరకు గతంలో కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ లేఖకు అనుబంధంగా పూర్తి స్థాయి ప్రతిపాదనలను జత చేసి కేంద్రానికి పంపించింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం....వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే ఆ ప్రాంతమే స్థానికతగా ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుతం విజయవాడకు తరలివెళ్లాల్సిన ఉద్యోగుల పిల్లల్లో దాదాపు 90 శాతం వరకు హైదరాబాదే స్థానికత కలిగి ఉన్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోవారికి ఇబ్బందులు రాకుండా చూసేందుకు స్థానికతపై కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నించడం, ఒత్తిడి పెంచడం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే 1974లో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల నియంత్రణ-అడ్మిషన్ల ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని రాష్ర్టప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి ప్రతిపాదించారు. 1975లో జారీచేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఉత్తర్వుల్లోని ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ నిబంధనలను కూడా మార్పు చేయాలని ప్రతిపాదించారు. ఈ రెండు నిబంధనల్లోనూ రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన వారి పిల్లలకు స్థానికత కల్పించాలని మార్పు చేసేలా చూడాలని ప్రతిపాదించారు. మొత్తంగా విభజన జరిగిన మూడేళ్ల వరకు, అంటే 2017 జూన్ రెండులోగా కొత్త రాష్ట్రానికి తరలి వెళ్లిన వారికి స్థానికత లభిస్తుంది.