డాక్టర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎట్టకేలకు నవ్యాంధ్రలో ఏర్పడింది. గుంటూరు జిల్లాలోని లాం పాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ కలిసి దానికి శంకుస్థాపన చేశారు. కానీ, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నవ్యాంధ్రకు ఏర్పడిన నష్టం ఎంతో తెలుసా? దాదాపు 18 వేల కోట్ల రూపాయలు. ఔను.. ఇది నిజం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దానికి ఎన్జీ రంగా పేరు పెట్టారు. ఆ తర్వాత నుంచే దానిని భారీగా విస్తరించడం ప్రారంభించారు. వాస్తవానికి, వ్యవసాయమంతా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనే సాగుతుంది. దాని అనుబంధ పరిశ్రమలూ అక్కడే ఉన్నాయి. అయినా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మాత్రం హైదరాబాద్ లో విస్తరించాలని నిర్ణయించారు. దీనిపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ వంగడాల రూపకల్పన - ప్రయోగాలన్నీ హైదరాబాద్ లోనే జరగాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ వర్సిటీకి వందలాది ఎకరాలను కేటాయించింది. అందుకే రాజేంద్ర నగర్ లోని విశాలమైన ప్రాంగణంలో ఎన్జీ రంగా వర్సిటీ కొలువుదీరింది. రాష్ట్ర విభజన తర్వాత మొత్తం యూనివర్సిటీని తెలంగాణ సొంతం చేసుకుంది. దాని భూములు - భవనాలు సహా మొత్తం చేజిక్కించుకుంది. దాని పేరును కూడా మార్చేసింది. ఈ భూములు - భవనాలు - ఎన్జీరంగా వర్సిటీ ఆస్తుల విలువ దాదాపు 30 వేల కోట్లకుపైనేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దామాషా ప్రాతిపదికన అయినా నవ్యాంధ్రకు దాదాపు 18 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మొత్తం వర్సిటీని తెలంగాణ చేజిక్కించుకుంది. వ్యవసాయ వర్సిటీకి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఖర్చు పెట్టారు. అన్ని భూములు - భవనాలను ఉమ్మడి ఖజానాతోనే కొనుగోలు చేశారు. కానీ ఒక్కపైసా కూడా ఇవ్వకుండా చేజిక్కించుకోవడం ద్వారా నవ్యాంధ్రకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు గుంటూరులోని లాం పాంలో నవ్యాంధ్ర కొత్తగా యూనివర్సిటీని ప్రారంభించుకోవాల్సి ఉంది. దీనికి మొదటి నుంచీ అడుగులు వేయాల్సి వస్తోంది.
భూములు - భవనాల రూపంలో ఆర్థికంగా జరిగిన నష్టం కంటే సాంకేతికంగా జరిగిన నష్టం మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఉదాహరణకు - వరి పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. చెరకు పరిశోధన కేంద్రం ఇక్కడే ఉంది. మిర్చి పరిశోధన కేంద్రం ఇక్కడే.. పత్తి పరిశోధన కేంద్రం ఇక్కడే.. మొక్కజొన్న - అరటి - పసుపు - పండ్ల తోటలు ఇలా ఏ పరిశోధన కేంద్రం అయినా దానిని హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. వాస్తవానికి, అప్పట్లో వీటిని తెలంగాణ - ఏపీ ప్రాంతాల్లోని ఆయా పంటలు పండే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్లు వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నిటినీ హైదరాబాద్ లోనే ఏర్పాటు చేశారు. వాటికి కొన్ని కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ పరిశోదన కేంద్రాలు - అత్యాధునిక పరికరాలు తెలంగాణపరమయ్యాయి. వీటన్నిటినీ కొనుగోలు చేయాలంటే నవ్యాంధ్ర మరిన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేనా.. ఇప్పటి వరకు చేసిన శ్రమను మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. అదే సమయంలో - భూములు - భవనాలు - పరికరాలు - సాంకేతిక పరిజ్ఞానం తదితరాలను దామాషా ప్రాతిపదికన పంచుకోవాలన్న శాస్త్రవేత్తల వినతులను నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినిపించుకోవడం లేదు. తెలంగాణ నుంచి దామాషా ప్రతిపాదికన వాటా అడగడడానికి ఆయన ముందుకు రావడం లేదు. దాంతో నవ్యాంధ్రవీటన్నిటినీ శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తోంది.
నిజానికి ఇటువంటి వివాదాలు వస్తాయనే కొన్ని సంస్థలను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది - పదో షెడ్యూళ్లలో పెట్టారు. పదో షెడ్యూల్లోని సంస్థలను ఇరు రాష్ట్రాలూ దామాషా ప్రాతిపదికన పంచుకోవాలి. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీని కూడా పదో షెడ్యూల్లోనే పెట్టారు. కానీ, విభజన చట్టం ప్రకారం దానిని విభజించలేదు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నవ్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారని శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే.. ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకుంటున్న ప్రతిపక్షాలు కూడా దాదాపు 20 వేల కోట్ల విలువైన ఆస్తులను నవ్యాంధ్ర కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వైసీపీ కూడా తెలంగాణకు అనుకూలంగానే వ్యవహరిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. భూములు, భవనాలు పోయినా కనీసం సాంకేతిక పరిజ్ఞానం - పరికరాలను అయినా లాం ఫాంకు తెచ్చుకోవాలని, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారో చూడాల్సిందే.