ఫోకస్: ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో పీఆర్వో జాబా?

Update: 2020-04-23 11:30 GMT
ఏపీ ప్రభుత్వంలో అసలేం జరుగుతోంది. కొన్ని విచిత్రమైన సంగతుల వెనుక అసలు కారణమేంటి? అది పెద్దలకు తెలిసి జరుగుతున్నాయా? లేక తెలియక జరుగుతున్నాయో ఎవరికి అంతు బట్టడంలేదట.. ఇప్పటికే ప్రభుత్వంలో చాలా మంది ‘పీఆర్వో’లు ఉన్నారు. ప్రభుత్వం ఏమీ చేసినా మీడియాకు చెప్పడం వారి విధి. ప్రజల్లోకి ప్రభుత్వం పట్ల పాజిటివ్ సంకేతాలు పంపేలా వార్తలను తయారు చేసి పంపడం వారి కర్తవ్యం.. సీఎం జగన్ శ్రమకోర్చి చేస్తున్న పనులన్నింటిని ప్రజలకు చేరువ చేయాల్సిన గురుతర బాధ్యత పీఆర్వోల మీద ఉంది.

అయితే సీఎం జగన్ కష్టపడుతున్నా కానీ దానికి హైప్ తీసుకురావడంలో కొందరు పీఆర్వోలు విఫలమవుతోందన్న ఆరోపణలున్నాయి. వైసీపీ సర్కారు కరోనా కట్టడిలో ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తూ అన్ని రాష్ట్రాలకంటే ధీటుగా జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతోంది. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానాల్లో పోటీపడుతోంది.  అయితే అనుకున్న మైలేజ్ ఏపీ ప్రభుత్వానికి తీసుకురావడంలో కొందరు పీఆర్వోలు  అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది పక్కన పెడితే.. తాజాగా ఒక పీఆర్వో నియామకం అందరినీ ఆశ్చర్యపరిచిందని చర్చ సాగుతోంది.. అతను సాక్షి దినపత్రికలో ఎన్నికలకు ముందు ఒక ఉద్యోగి అని తెలిసింది. అయితే ఏదో అవకతవకలు జరగడంతో వైఎస్ జగన్ యాత్ర సమయంలో అతడిని సాక్షిలో నుంచి తీసేశారని ప్రచారం సాగుతోంది. ఆ వివాదం 3 కోట్లపై కోర్టులో కూడా వివాదం నడుస్తోందని సమాచారం.   అనూహ్యంగా అతడిని పీఆర్వోగా నియమించడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.  మీడియా వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. అతడి బ్యాక్ గ్రౌండ్ అంతా తెలిసి నియామకం చేశారా తెలియక ఇచ్చారో అనే  అనుమానం అందిరిలోనూ కలుగుతోంది. ఏది ఏమైనా ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఏపీ ప్రభుత్వంలో పీఆర్వో జాబ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News