నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామాల్లో తమ భూములు ఇచ్చేది లేదని, భూ సేకరణతోపాటు సమీకరణకు కూడా తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేస్తూ ఉంటే.. మరికొన్ని గ్రామాలు మాత్రం మా భూములను కూడా రాజధాని నిర్మాణానికి తీసుకోండి అంటూ ముందుకు వస్తున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు 29 గ్రామాల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. వీటి పరిధిలోనే రాజధానిని నిర్మించాలని కూడా భావిస్తున్నారు. అయితే, వీటి బయట ఉన్న కొన్ని గ్రామాలు కూడా తమ భూములు ఇస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాయి. అమరావతికి ఆనుకుని ఉండే పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో దాదాపు 8000 ఎకరాలు ఉన్నాయి. ఈ మొత్తం భూములను రాజధాని నిర్మాణానికి ఇస్తామంటూ అక్కడి రైతులు ముందుకు వచ్చారు.
ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లోని రైతులు రాజధానికి తమ భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా వీరికి అండదండగా ఉన్నారు. అదే సమయంలో రాజధానికి వెలుపల ఉన్న పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విముఖంగా ఉన్న గ్రామాలను వదిలేసి, సుముఖంగా ఉన్న గ్రామాల్లో భూములను తీసుకుని, ఆ మేరకు రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తే బాగుంటుందని, భూ సేకరణ ఇబ్బంది కూడా తొలగిపోతుందని అధికార వర్గాలు ప్రభుత్వానికి వివరిస్తున్నాయి. ఈ మూడు గ్రామాలు కూడా రాజధాని ప్రాంతానికి ఆనుకునే ఉన్నాయి కనక పెద్దగా ఇబ్బందులు రావని కూడా అంచనా వేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ మార్పునకు అంగీకరిస్తుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.