అమరావతి అదిరేన్...

Update: 2015-08-11 10:09 GMT
అమరావతి అంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాదు. అక్కడికి సమీపంలోని పంచారామ క్షేత్రమైన అమరావతి పుణ్యక్షేత్రం. ఏపీలోని పంచారామాల్లో ఇది ఒకటి. అత్యంత పురాతనమైన ఆలయం ఇది. దీనికి పర్యాటకులూ ఎక్కువే అయినా ఏపీ ప్రభుత్వం కానీ పర్యాటక శాఖ కానీ దీనిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు ఈ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఈ ఆలయాన్ని రూ.8.52 కోట్లతో అభివృద్ధి చేయాలని ఏపీ పర్యాటక శాఖ భావిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది.

అమరావతి అమర లింగేశ్వర స్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ దక్షిణ గోపురం వైపున ప్రవేశ ద్వారం నిర్మించాలని భావిస్తోంది. క్యూ కాంప్లెక్స్, పర్యాటక కేంద్రం నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. సోలార్ ప్యానెళ్లతో లైటింగ్ ను అభివృద్ధి చేస్తారు. మొత్తంమీద దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి పంపారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది కృష్ణా నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాదిమంది అమరావతిని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమర లింగేశ్వర స్వామి ఆలయానికి పర్యాటక, ఆధ్యాత్మిక శోభ తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News