పర్యాటకశాఖ ప్లాన్స్‌: ఏపీలో ద్వీపాలు!

Update: 2015-04-07 06:19 GMT
భవానీ ద్వీపంతో పాటే దాని పక్కనే ఉన్న నాలుగు ద్వీపాల్లోనూ అభివృద్ది కార్యక్రమలు చేసి ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలని భావిస్తుంది ప్రభుత్వం. రాజధాని లేని రాష్ట్రంగా అవతరించిన ఏపీలో రాజధాని ప్రాంతం నిర్మాణం జరిగి అభివృద్ధి జరిగితే ఇక్కడికొచ్చే పర్యాటకులు 50 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు! ఈ క్రమంలో రాజధాని నిర్మాణంతో పాటు పర్యాటకులకు అనుగుణంగా రిసార్టుల సంఖ్యను కూడా పెంచాలని యోచిస్తోంది ఏపీ. ఇందుకు భవానీ ద్వీపంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ద్వీపాల్లో థీమ్‌పార్కులు, రెస్టారెంట్లు, లైటింగ్‌ హౌస్‌లు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తుంది. ఇందుకు సింగపూర్‌లోని %షష%సెంటోసా ద్వీపం%% ను ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నారు! ఈ టూరిజం ప్రాజెక్టుల కోసం సుమారు రూ.150 కోట్లు వెచ్చించేందుకు అంచనాలు తయారు చేస్తున్నారట!

ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన, కృష్ణానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్లు, రిసార్టులను నిర్మించి భారీసంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏపీ రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్టులు, థీమ్‌పార్కులు, బోటింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి...  రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్‌ వచ్చాక క్యాపిటల్‌ ఏరియాలో టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు టూరిజం శాఖ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా కృష్ణా నదికి రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర విశాలమైన బీచ్‌రోడ్లు ఏర్పాటు చేయాలని ప్లాన్స్‌ వేస్తున్నారు. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లు అమరావతి... విశ్వనగరం లుక్‌ ని సంపాదించడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Tags:    

Similar News