నవ్యాంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా తమిళనాడులోని మరో కూడంకుళం కానుంది. అణు విద్యుత్తు ప్రాజెక్టులకు ఆ జిల్లా నిలయం కానుంది. అదే సమయంలో, తీవ్ర స్థాయి ఆందోళనలకూ శ్రీకాకుళం జిల్లా వేదిక కానుంది.
కూడంకుళంలో ఇప్పటికే రెండు అణు విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. మూడు నాలుగు ప్లాంట్లను అతి త్వరలో ప్రారంభించనున్నారు. నాలుగో ప్లాంటును కూడా ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అణు విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు అణు విద్యుత్తు ప్లాంట్లు వద్దని, తమ ప్రాంతాలను కాలుష్యమయం చేయవద్దని అక్కడి ప్రజలు ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొన్నిసార్లు హింసాత్మకం కూడా అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడంకుళం కాకుండా మరో అణు విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు దేశంలో మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు మా రాష్ట్రంలోని శ్రీకాకుళంలో పెట్టండి అంటూ చంద్రబాబు ప్రతిపాదన చేశారు. దాంతో దేశంలోని రెండో అణు విద్యుత్తు స్థావరంగా ఏపీలోని శ్రీకాకళాన్ని ఎంపిక చేశారు. కూడంకుళంలో పెట్టాలని భావిస్తున్న ఐదు, ఆరు అణు విద్యుత్తు ప్లాంట్లను ఇక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికితోడు తాజాగా ప్రధాని మోదీ తన పర్యటనలో మరో 12 అణు విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు రష్యా సహకారం కోసం ఒప్పందం చేసుకున్నారు. ఇందులోని మరో నాలుగు ప్లాంట్లు కూడా శ్రీకాకుళానికి రానుంది. మొత్తంమీద అతి త్వరలోనే శ్రీకాకుళానికి ఆరు అణు విద్యుత్తు ప్లాంట్లు రానున్నాయని అధికార వర్గాలు వివరిస్తున్నాయి.
అణు విద్యుత్తు ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు మరోవైపు శ్రీకాకుళం ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ అంశం భవిష్యత్తులో తీవ్ర వివాదాస్పదం కూడా కానుంది.