భోగాపురానికి లైన్ క్లియర్..ఏపీకి మరో వరం!

Update: 2020-06-12 12:42 GMT
ఏపీకి మరో వరం లభించింది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదుర్చుకుంది.

 సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం తరుఫున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ,జీఎంఆర్ చైర్మన్ జీబీఎస్ రాజు సంతకాలు చేశారు.

ఏపీలో సీఎం జగన్ ఆశించిన విధంగా చిరస్మరణీయ రీతిలో ఈ ఎయిర్ పోర్టు నిర్మిస్తామని జీఎంఆర్ ప్రతినిధులు ఎంఓయూ తెలిపారు. అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకుంటామని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్టు నుంచి విశాఖ నగరానికి వీలైనంత వేగంగా.. సులభంగా రహదారులు నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో విశాఖ నగరానికి అనుసంధానం చేసేలా మెట్రో ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ తెలిపారు.


Tags:    

Similar News