తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఓటుకు నోటు వ్యవహారంలో బుక్ చేయటంతో బాబు ఎంతలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్‌తో పాటు.. ఈ వ్యవహారంలో బాబుకు చెందినవిగా చెబుతున్న ఆడియో టేపు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తెలంగాణకు సంబంధించి అంశాల్ని సెటిల్ చేసే అంశంపై బాబు పూర్తిగా దృష్టి సారించారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో లారీ యజమానులు ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. డీజిల్‌పై ఏపీలో విధించిన వ్యాట్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. లీటరకు నాలుగు రూపాయిల మేర డీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో తమపై ఆర్థికంగా మోయలేనంత భారం పడుతుందని వారు వాపోతున్నారు.
ఇప్పటికే పలు విన్నపాలు చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంతో.. ఈ అంశంపై జూన్ 24 నుంచి బంద్ పాటించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. లారీ యజమానులకు మద్ధతుగా పెట్రోల్.. డీజిల్ బంకుల యజమానులు సైతం సమ్మె బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న సమస్యలు చాలక.. ఇలాంటి సమ్మెల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే.. అది ఏపీ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచే వీలుంది. మరి.. ఈ విషయం మీద బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.