క్రమశిక్షణకు మారుపేరు, అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడానికి పార్టీ నేతలు సదా సిద్ధం వంటి విశేషణాలతో తెలుగుదేశం పార్టీని గౌరవించే విషయంలో ఇకనుంచి అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుందేమో!. ఎందుకంటే సాక్షాత్తు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులను ఉద్దేశించి చేసిన సూచనలే ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. సీనియర్ నేతలు అయిన మంత్రులే వాటిని లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా సామాన్య ప్రజల విషయంలో సీఎం చంద్రబాబు సూచన, మంత్రుల ఆచరణ గురించి.
ఏపీలోని ప్రజానికం తమకు ఉన్న వివిధ రకాల సమస్యలను విన్నవించుకునేందుకు అధికారుల్ని, మంత్రుల్ని కలవడానికి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ప్రతి శుక్రవారాన్ని ఫిర్యాదుల రోజుగా అమలు చేశారు. ఆ రోజు వారాంతపు రోజు కావడంతో అధికారులు, మంత్రుల హాజరు నామమాత్రంగానే ఉంటోంది. చివరకు ఉద్యోగులు కూడా శుక్రవారం మధ్యాహ్నం నుంచి వెళ్లిపోవడంతో సందర్శకులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఫిర్యాదుల రోజును గురువారానికి మార్చారు. రెండు రోజుల క్రితమే దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించి, నేరుగా మంత్రులకే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ అయిన తరువాత వచ్చిన తొలి గురువారం నాడే మంత్రులు సచివాలయానికి డుమ్మా కొట్టారు. కేవలం ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఒక్కరే సచివాలయంలో కనిపించగా, మిగిలిన వారంతా గైర్హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన సమస్యలతో వచ్చిన కొంతమంది లోకేష్‌ను కలిసి ఫిర్యాదులందించారు.
సీిఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లగా, మిగిలిన మంత్రులు జిల్లాలకు వెళ్లిపోయారు. దీతో సచివాలయం పూర్తిగా బోసిపోయింది. దీంతో మండుటెండలో సచివాలయానికి వచ్చిన సందర్శకులకు సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. చివరకు అధికారులు కూడా సమావేశాలు, సమీక్షలంటూ సచివాలయానికి దూరమయ్యారు. చాలాకాలంగా ఫిర్యాదుల రోజును తప్పనిసరిగా పాటించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మంత్రులెవరూ పట్టించుకోకపోవడం, గైర్హాజరైన వారిపై ఆయన ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ప్రజల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల రోజు(గ్రీవెన్స్ డే)ను అమలు చేస్తున్నప్పటికీ, దానిని పట్టించుకునే వారే కరవవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/