జగన్ పార్టీకి చెందిన ఎంపీ ఒకరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఎయిరిండియా మేనేజర్ పై చేయి చేసుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఈ అంశంపై ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ.. లోగుట్టుగా మాత్రం ఈ వ్యవహారం మీద పెద్ద హడావుడే నడిచినట్లుగా చెబుతున్నారు.
తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి వెళ్లాల్సిన ఒక విమానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు బయలుదేరాల్సి ఉంది. అయితే.. బోర్డింగ్ పాస్ ను విమానం బయలుదేరటానికి 45 నిమిషాల ముందే మూసేస్తారు. అయితే.. ఆలస్యంగా వచ్చిన సదరు ఎంపీ తన బంధువును అనుమతించాలన్నారు. ఈ విషయంపై ఆయనకు నచ్చ చెప్పేందుకు అధికారులు ప్రయత్నించటం.. ఈ సందర్భంగా ఆగ్రహం చెందిన ఎంపీ.. ఎయిర్ ఇండియా మేనేజర్ పై చేయి చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
దీంతో వ్యవహారం ఒక్కసారిగా సీరియస్ కావటం.. పోలీసులు సీన్ లోకి వచ్చేశారు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో గంటన్నరలో ఎయిర్ పోర్ట్‌కి వస్తున్న సమాచారంతో అలెర్ట్ అయిన ఇరు వర్గాలవారు ఈ వ్యవహారంపై రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. జగన్ ఎంపీ రాజీ మాటతో ఎయిర్ ఇండియా మేనేజర్ మెత్తబడినట్లుగా సమాచారం. దీంతో.. ఈ వ్యవహారం నలుగురి మధ్యన సమిసిపోయింది. అయితే.. అధికారులపై చేయి చేసుకోవటాన్ని ఎయిర్ ఇండియా అధికారులు తీవ్రంగా భావిస్తున్నారు. విపక్షంలో ఉన్న ఎంపీనే ఇలా చేస్తే..రేపొద్దున్న అధికారం చేతిలో ఉంటే మరెంత చెలరేగిపోతారో? అన్న మాటలు వినిపిస్తున్నాయి.