గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం బురదలో చిక్కుకుపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సచివాలయ ప్రాంతమంతా చిత్తడిగా మారింది. సచివాలయానికి నాలుగు వైపులా నడవడానికి వీల్లేనంతగా బురద పేరుకుపోయింది. అసలే నల్లరేగడి భూములు కావటంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతమంతా బురదమయమైపోతోంది. కొద్దిరోజుల క్రితం సచివాలయానికి నిర్మించిన అప్రోచ్ రోడ్డుపై బురద పేరుకుపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సచివాలయాన్ని ప్రారంభించడానికి అధికారులు - ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో వారు బురదబారిన పడకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన తాత్కాలిక ఏర్పాట్లు కూడా ఫలించలేదు. దీంతో సచివాలయానికి వచ్చిన ప్రతిఒక్కరూ ఇబ్బందులకు గురయ్యారు.
మరోవైపు సచివాలయంలో బుధవారం ప్రారంభించిన బ్లాకుల్లో పనులు ఏమాత్రం పూర్తికాలేదు. ఓపక్క జోరున వర్షం కురుస్తున్నా సిమెంట్ పనులను నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమర్చిన కిటికీల నుంచి వర్షపు నీరు ఛాంబర్లలోకి వచ్చేస్తోంది. ఛాంబర్లలో వైరింగ్ పని పూర్తికాలేదు. వర్కింగ్ స్టేషన్లను నామ్ కేవాస్తేగా అమర్చారు. గోడలకు బదులు జిప్సమ్ షీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. వీటికి తుదిరూపు తీసుకొచ్చేందుకు కనీసం నెలరోజుల వ్యవధి పడుతుందని సిబ్బంది చెబుతున్నారు.
అయితే.. వచ్చే నెలాఖరుకు పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ చెబుతున్నారు. సచివాలయ ప్రాంగణంలో రోడ్లు - ఫ్లోరింగ్ - ప్రధాన రహదార్లతో పాటు టాయిలెట్లు - భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.నెల రోజుల తరువాత ఇలాంటి ఇబ్బందుల ఉండబోవని అంటున్నారు.