అడ్ర‌స్ కూడా ప‌ట్టుకోలేక‌పోయిన ఏపీ పోలీస్‌

Update: 2015-08-18 08:52 GMT
ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో తెలంగాణ అధికారుల‌కు.. ఏపీ అధికారుల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఇట్టే తెలుస్తోంది. తాము చేసే ప‌ని ప‌ట్ల ప‌క్కా వ్యూహం.. ఏం చేయాల‌న్న దానిపై స్ప‌ష్ట‌త ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

అదే స‌మ‌యంలో ఏపీ పోలీసుల్లో అయోమ‌యం.. ఏదో చేశామంటే చేశామ‌న్న ధోర‌ణి క‌నిపించ‌క మాన‌దు. చేసే ప‌ని ప‌ట్ల ముంద‌స్తు క‌స‌ర‌త్తు ఏ మాత్రం లేక‌పోవ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించ‌క మాన‌దు. ఓటుకు నోటు కేసులో లోకేశ్ కారుడ్రైవ‌ర్ కొండ‌ల్‌ రెడ్డికి నోటీసులు ఇవ్వాల‌ని భావించిన స‌మ‌యంలో.. నోటీసులు ఇవ్వ‌టానికి ఒక‌రోజు ముందు ఏపీ సీఎం చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ టీ ఏసీబీ అధికారులు.. అక్క‌డి పోలీసుల‌తో ముచ్చ‌ట్లు పెట్టి.. వివ‌రాలు సేక‌రించుకోవ‌టం.. బాబు భ‌ద్ర‌తాసిబ్బంది వారిని పిలిపించి.. ఏసీబీ ఉన్న‌తాధికారుల‌తో గ‌ట్టిగా మాట్లాడ‌టంతో సారీ చెప్పేసి.. వ‌దిలిపెట్ట‌మ‌ని కోర‌టం తెలిసిందే.

ఇది జ‌రిగిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే లోకేశ్ కారు డ్రైవ‌ర్ కు నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే లోకేశ్ కారు డ్రైవ‌ర్ కు నోటీసులు ఇచ్చారో.. వెనువెంట‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్  కారు డ్రైవ‌ర్‌.. గ‌న్ మ్యాన్ల‌ కు నోటీసులు ఇవ్వాల‌ని ఏపీ అధికారులు నిర్ణ‌యించారు. ఏ అంశం మీద అంటే.. ఓటుకు నోటు కేసులో ఏ4 అయిన మ‌త్త‌య్య ఏపీలో ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ఆరోప‌ణ‌లు చేసి.. ఏపీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో మ‌త్త‌య్య ఫోన్ కి కేటీఆర్ గ‌న్‌మ్యాన్‌.. కారు డ్రైవ‌ర్ ఫోన్ల నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌న్న అంశంపై విచార‌ణ చేప‌ట్టేందుకు వారికి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ పోలీసులు వ‌చ్చారు. చివ‌ర‌కు వారి ఆచూకీ సంగ‌తి త‌ర్వాత‌.. వారి అడ్ర‌స్ లు సైతం తెలుసుకోలేక‌పోయారు. చివ‌ర‌కు తెలంగాణ నిఘా పోలీసు కార్యాల‌యంలో వీరికి సంబంధించిన నోటీసులు ఇచ్చి వెళ్లారు. నోటీసులు ఇవ్వాలంటే దానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించ‌టం.. ప‌క్కా స‌మాచారం ఉన్న తర్వాత నోటీసుల కార్య‌క్ర‌మం చేప‌డ‌తారు. కానీ.. ఏపీ పోలీసులు మాత్రం అలాంటి క‌స‌ర‌త్తు చేయ‌కుండా.. అభాసుపాల‌వుతున్న ప‌రిస్థితి.
Tags:    

Similar News