నవయుగకు జగన్ షాక్: పోలవరం కాంట్రాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం..

Update: 2019-09-04 10:08 GMT
నవయుగ సంస్థకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇటీవల నవయుగ కంపెనీ పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టర్‌ కు ఇచ్చిన అడ్వాన్స్‌ ల రికవరీకి కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ రోజు అమ‌రావతిలో ఏపీ కేబినెట్ స‌మావేశం అయ్యింది. మొత్తం 38 అంశాల అజెండాతో స‌మావేశం ప్రారంభ‌మైంది.

కాగా, ఇటీవల హైడల్ పవర్ ప్రాజెక్టు నుంచి తప్పిస్తూ ఏపీ పభుత్వం తీసుకున్న నిర్ణయం పైన నవయుగ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే తాజాగా దీని పైన ప్రభుత్వ అప్పీల్ కు వెళ్లగా కోర్టులో దీని పైన విచారణ సాగుతోంది. ఇదే సమయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్‌ రద్దుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోర్టు ప‌నులు ప్రారంభించ‌నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

అటు ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్ చెందిన సంస్థకు జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ హయాంలో గాలేరు-నగరి ప‌నుల‌ను సీఎం రమేష్‌ కు చెందిన రిత్విక్ కంపెనీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు-నగరి పనులను రిత్విక్‌ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గాలేరు-నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుని - పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది
Tags:    

Similar News