ఏపీ సర్కార్ ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు ను ప్రవేశపెట్టనుంది. దీని కింద అన్ని శాఖల కార్యకలాపాలను కంప్యూటరైజ్ చేస్తారు. శనివారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. ఇందుకు సంబంధిం వివరాలను మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.
- ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు పరిధిలోకి 33 శాఖలు, 315 హెచ్ఓడీలు, 745 ఈ- సర్వీసులను తీసుకురానున్నారు.
- 72 ప్రాజెక్టులను 14 ప్యాకేజీలుగా వర్గీకరిస్తారు.ఇందుకోసం మూడు దశల్లో రూ. 2358 కోట్ల వెచ్చిస్తారు.
- విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం కాపులపాడులో యునిటెక్ కంపెనీకి 1750 ఎకరాల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది.
త్వరలోనే ఈ భూమిని ఐటీ కంపెనీలు, పరిశ్రమలకు కేటాయిస్తారు.
- శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం నరవలో ఏర్పాటుకానున్న సప్తగిరి పవర్ ప్రాజెక్ట్ కు 9 ఎకరాలు కేటాయించారు.
- తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలం, కోనలో ఏపీఐఐసీ వద్ద ఉన్న 2094 ఎకరాలు కాకినాడ సెజ్ కోసం కేటాయించగా..ఇందులో 505 ఎకరాలలో దివీస్ లేబరేటరీస్ ఏర్పాటుకు అనుమతించారు.
- ఈనెల 9 నుంచి 29 వరకు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న యాత్ర చేపట్టనున్నారు.
- 13 జిల్లాల్లో 13 రోజుల పాటు చంద్రన్న యాత్ర ఉంటుంది.
- వ్యవసాయానికి పగటిపూట 7 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించాలని నిర్ణయించారు.