అమరావతికి ఆ రెండూ హైలైట్సే..

Update: 2016-01-24 06:19 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఎన్నో కొత్త అద్భుతాలు... ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పడుతున్న ఈ నగరంలో తెలుగు నేల ముందెన్నడూ చూడని వసతులు రానున్నాయి. అది సౌకర్యం కావొచ్చు, వినోదం కావొచ్చు ఏదైనా సరే అమరావతికి హైలైట్ గా నిలవనుంది. అమరావతి నగరంలో అలాంటి రెండు ప్రత్యేక అంశాలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి.

అమరావతి నగరంలో కృష్ణానది అంతర్భాగాన దేశంలోనే తొలి అండర్‌ వాటర్‌ టన్నెల్‌ నిర్మించనున్నారు. సింగపూర్‌ కు చెందిన అమరావతి రాజధాని నిర్మాణ డిజైనర్స్‌ ఇందుకు సంబందించిన సవివర మాస్టర్‌ ప్లాన్‌ ను రూపొందిచనున్నారు. నది అడుగు భాగాన భూగర్భంలో మూడు కిలోమీటర్ల నిడివిన ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ టన్నెల్‌ మార్గం పర్యాటకులను బాగా ఆకర్షించనుందని భావిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారుంతుందని సీఆర్‌ డీఏకు చెందిన సీనియర్‌ ప్లానర్‌ అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నదీపరివాహకంగా జైగాంటిక్‌ జెయింట్‌ వీల్‌ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది రాజధానికి ఒక ఆకర్షణగా నిలుస్తూ పర్యాటకుల కోసం 24గంటలు పనిచేసేలా రూపొందిస్తున్నారు.
Tags:    

Similar News