రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు ఇదే మాట టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం కీలకమైన సమస్యలతో టాలీవుడ్ తీవ్ర కష్టాల్లో ఉందని నటులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో టాలీవుడ్ ఇబ్బందుల్లో ఉందనేది వాస్తవం. ఈ విషయం ప్రభుత్వంలోని వారు కొందరు అంటున్నారు. అయితే.. పరిస్థితులను బట్టి అన్నీ సర్దు కుంటాయని చెబుతున్నారు. అయితే.. వాస్తవానికి ఈ సమస్యలపై చర్చించేందుకు పలువురు ప్రయత్నించారు.
అయితే.. ఎవరికీ కూడా సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అంతేకాదు.. ఆయన అసలు దీనిపై స్పందించడం కూడా మానేశారు. ఈ క్రమంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు రంగంలోకి వచ్చారు. ఈ సమస్యపై అంటే.. టికెట్ల ధరల తగ్గింపు, ధియేటర్లపై దాడులు అంశాలపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే.. సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి మోహన్ బాబు.. ఏపీ సీఎం జగన్‌కు బంధువు. దీంతో మోహన్ బాబుకు జగన్ ప్రాధాన్యం ఇస్తారని అందరూ అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా మోహన్ బాబును పక్కన పెట్టి.. చిరంజీవికి జగన్ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. అంతే కాదు.. జగనే తనను స్వయంగా చర్చకు ఆహ్వానించారంటూ.. చిరంజీవే స్వయంగా వెల్లడించారు. దీనిని బట్టి.. బంధువైన మోహన్ బాబుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. చిరంజీవికి అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం ఏంటనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న మంచు విష్ణు.. ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా.. జగన్ మా బావ.. అని చెప్పుకొంటున్నాడు.
అయితే.. ఆ మేరకు మోహన్ బాబుకు కానీ.. ఆయన ఫ్యామిలీకి కానీ.. జగన్ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. పైగా ఇప్పుడు కీలకమైన చర్చల విషయంలోనూ వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కేవలం చిరుకు ఇచ్చిన ప్రాధాన్యంలో కొంచెం కూడా మోహన్ బాబు కుటుంబానికి ఇవ్వలేదని.. అంటున్నారు. అంతేకాదు.. గతంలో చంద్రబాబు హయాంలో తన కాలేజీకి ఫీజు రీయింబర్స్ నిధులు ఇవ్వలేదని.. పెద్ద ఎత్తున యాగీ చేసిన మోహన్ బాబు.. ఏరికోరి ఎంచుకున్న జగన్ సర్కారు హయాంలోనూ.. డబ్బులు రావాలేని.. కాలేజీలకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని చెబుతున్నారు. మరి నిజమో కాదో తెలియాల్సి ఉంది.