నేతల సూచనతో అలెర్ట్ అయిన జగన్

Update: 2020-06-06 08:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన ఇసుక కొరతపై సీఎం జగన్ ఫోకస్ చేశారు.. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో తలెత్తిన ఇసుక కొరతపై సూచనలు చేయడంతో సీఎం జగన్ ఇప్పుడు ఆ సమస్యపై దృష్టి సారించారు.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అధికారులతో ఇసుకపై సీఎం జగన్  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా-లాక్ డౌన్ తర్వాత ఇసుక రీచులన్నీ మూతపడడం.. మళ్లీ రీచ్ లు ప్రారంభం అవుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని కోరారు. శాండ్ పోర్టల్ లో ఇసుక అమ్మకాలు విరివిగా చేయాలని సూచించారు. ఇదే సమయంలో నదులు, వాగులు, వంకల పక్కన ఉండే పరిసర గ్రామాల ప్రజలకు సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

ప్రతీరోజు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక బుకింగ్స్  కు సమయం కేటాయించాలని.. శాండ్ పోర్టల్ లో బల్క్ ఆర్డర్లకు అనుమతుల అధికారం జాయింట్ కలెక్టర్ కు అప్పగించాలని అన్నారు.
Tags:    

Similar News