మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు మరణాలు పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. మృతుల సంఖ్య రెండంకెలకు చేరింది. శనివారం ఒక్కరోజే ఏకంగా 17మంది వైరస్ బారిన మృత్యువాత పడ్డారు. కొత్తగా పాజిటివ్ కేసులు మొత్తం 1,813 నిర్ధారణ అయ్యాయి. వాటిలో ఏపీకి చెందిన కేసులు 1,775 ఉండగా.. ఇతర రాష్ట్రాల వారు 34 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి పాజిటివ్ తేలింది. రాష్ట్రంలో తాజాగా 17 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటిన్ ప్రకటించింది. కర్నూలులో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. అనంతపురం,కడప,విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 27,235. వీరిలో 14,393 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 309 మంది మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసులు 12,533. ఏపీలో ఇప్పటివరకు 11,36,255 నిర్ధారణ పరీక్షలు చేశారు.