ఆస్తులు పంచుకోవడం అంతా చూశారు. చూస్తున్నారు. కానీ అప్పులు పంచుకోవడం మాత్రం ఎవరికీ తెలియని వ్యవహారమే. అయితే అప్పుల వల్ల అప్రతిష్ట పెరుగుతుంది. పలుకుబడి తగ్గి పొలిటికల్ ఇమేజ్ డౌన్ అవుతుంది. అందుకే అప్పులు తప్పులూ అంటూ ఉంటే వాటిని వెంటనే పంచేసుకోవాలి. లేకపోతే పప్పు పప్పుగా జనాల తీర్పుతో చితికిపోతారంతే. ఏపీలో అప్పుల గురించి జరిగే చర్చ ఎపుడూ ఆస్తుల గురించి జరగలేదు. ఎందుకంటే ఏపీ అప్పులతోనే పుట్టింది కాబట్టి.
విభజన తరువాత ఏపీకి అప్పులు అక్షరాలా 1,20,556 కోట్ల రూపాయలు. ఇక ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ సంస్థల అప్పులు 14,028 కోట్ల రూపాయలు. మొత్తంగా కలిపి విభజన తరువాత ఏపీ అప్పులు 1,34,584 కోట్ల రూపాయలుగా ఒక కచ్చితమైన లెక్క ఇపుడు బయటకు వచ్చింది. మామూలుగా తెలిసో తెలియకో లేక లెక్కలు చూడకో చాలా మంది తొంబై వేల కోట్ల అప్పుతోనే ఏపీ విభజన జరిగింది అంటారు. సో ఆ లెక్క ఇక్కడ ఇలా చూసుకోవాలన్న మాట.
ఇక ఏపీకి 2014లో చంద్రబాబు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలో తెచ్చిన అప్పులు ఎన్ని అన్నది లెక్క తీస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అక్షరాలా 2,68, 115 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ సంస్థల అప్పులు 59,257 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం టోటల్ చేస్తే బాబు దిగిపోయేనాటికి 3,27,372 కోట్ల రూపాయలుగా కచ్చితమైన లెక్క తేలింది.
ఇక 2019లో జగన్ సీఎం అయ్యారు ఆయన హయాంలో రాష్ట్ర అప్పుల లెక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 3,81,069 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రభుత్వ గ్యారంటీతో ప్రభుత్వ సంస్థల అప్పులు 1,17,730గా ఉంది. మొత్తం కూడితే 4,98,799 కోట్ల రూపాయలు అన్న మాట. అంటే ఈ రోజుకు జూన్ 20 తేదీకి ఏపీలో అప్పులు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయని తెలుస్తోంది.
ఈ గణాంకాలను అన్నీ తాజాగా వైసీపీ ప్రభుత్వం బయటపెట్టింది. తమ హయాంలో అప్పులు చేశారని అంటున్నారు కానీ నిజానికి బాబు ఏలుబడిలోనే ఎక్కువ అప్పులు చేశారని ఆ పార్టీ పేర్కొనడం విశేషం. దానికి సోదాహరణంగా గణాంకాలతో వైసీపీ వివరిస్తోంది. విభజన నాటికి ఏపీ అప్పులు 1,34,584 కోట్ల రూపాయలుగా బాబు దిగిపోయేనాటికి దాన్ని 3,27,372 కోట్ల రూపాయలుగా చేశారని వైసీపీ అంటోంది.
ఈ పెరిగిన అప్పు 143.25 శాతంగా పేర్కొంటున్నారు. ఇక మూడేళ్ళలో వైసీపీ దాన్ని 4,98,799 కోట్ల రూపాయలుగా చేసింది. అంటే 52.36 శాతం మాత్రమే మూడేళ్ళలో అప్పుల పెరుగుదల ఉందని లెక్క చెబుతోంది. అయిదేళ్లలో బాబు 143.25గా అప్పు పెంచితే మూడేళ్ల గరిష్ట పాలనలో కూడా 52.36 శాతం మించలేదని చెబుతోంది. మరో రెండేళ్లలో అప్పు తెచ్చినా కూడా బాబు నాటి 143.25 అసాధరణ పెరుగుదల అయితే అప్పుల్లో ఉండదని వివరిస్తోంది.
ఇక సగటి వార్షిక అప్పు వృద్ధి రేటుని కూడా అయిదేళ్ల బాబు హయాంలో 19.46 శాతంగా ఉంటే మూడేళ్ల తమ ఏలుబడిలో అది కేవలం 15.77 శాతమే ఉందని వైసీపీ గణాంకాలతో వివరిస్తోంది. మొత్తానికి ఏపీని అప్పుల కుప్పగా చేసింది తాము కాదు చంద్రబాబే అని డైరెక్ట్ గా వైసీపీ చెప్పేందుకు ఈ వివరలాను మొత్తం తాజాగా విడుదల చేసింది.
నిజానికి ఏపీలో రుణ భారతం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఎన్నో సార్లు మేధావులు, రాజకీయ పార్టీలు కోరుతూ వచ్చాయి. మరి ఇపుడు వైసీపీ ఎందుకు ఆ వివరాలు బయటపెట్టిందో తెలియదు కానీ అప్పులూ తప్పులూ అన్నీ కూడా టీడీపీవే తప్ప తమవి కాదని చెప్పుకుంటోంది. మొత్తానికి ఈసారి ఎన్నికలలో అప్పుల మీదనే జనాల ఫోకస్ ఉంటుందని వైసీపీకి తెలుస్తోంది అంటున్నారు. బాబు టూర్ల సక్సెస్ వెనక కూడా ఏపీకి భారీ అప్పులే రీజన్ అని చెబుతున్నారు. ఆయన కూడా ఏపీ అప్పుల కుప్ప అని చెబుతూ వస్తున్నారు.
దానికి రిటార్టు అన్నట్లుగా వైసీపీ ఇపుడు ఈ నివేదికను బయటపెట్టింది అనుకోవాలి. ఏది ఏమైనా ఏపీకి ఏడెనిమిది లక్షల కోట్ల అప్పు ఉందని ఇప్పటిదాకా వినిపించిన మాటలు తప్పు అని అయిదు లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని వైసీపీ చెప్పడం కొంతలో కొంత ఊరట. మరి జగన్ దిగేనాటికి కచ్చితంగా పది లక్షల అప్పు పెట్టి పోతారని కూడా ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈ నివేదిక చూస్తే రానున్న రెండేళ్లలో మరో లక్ష కోట్ల దాకా అప్పులు చేసినా ఆరు కోట్లకు మించే అవకాశం కనిపించడంలేదు. అయితే ఈ ఆరు లక్షల అప్పు కూడా ఏపీకి అతి పెద్ద గుదిబండగానే చూడాలి. చిత్రమేంటి అంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చిన బాబు కానీ జగన్ కానీ దానిలో కొంత అయినా ఏపీలో ఉత్పాదక రంగాల మీద పెట్టలేదని చెబుతున్నారు. ఈ మొత్తం వివరాలు చూస్తే చేదు నిజం అదే అనిపిస్తుంది.