ఒక్క నెల‌లో వెయ్యి కోట్ల ఆదాయం పెరిగింది

Update: 2015-08-16 09:20 GMT
నిధుల కొర‌త‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఏపీకి కాస్తంత ఊర‌ట‌నిచ్చే అంశంగా దీన్ని చెప్పాలి. విభ‌జ‌న నేప‌థ్యంలో ఆదాయం స‌రిగా లేక ఇబ్బంది ప‌డుతున్న ఏపీకి.. జూలై ఒక్క నెల‌లోనే భారీగా రెవెన్యూ స‌మ‌కూరటం గ‌మ‌నార్హం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత బాబు స‌ర్కారు ఏర్పాటు చేసిన ప‌ద్నాలుగు నెల‌లుగా వ‌స్తున్న ఆదాయానికి భిన్నంగా.. ఒక్క జూలైలోనే ఆదాయం భారీగా పెరిగింది.

ఇప్ప‌టివ‌ర‌కూ నెల‌కు రూ.3500 చొప్పున ఆదాయం వ‌స్తుంటే..జులై నెల‌లో మాత్రం అందుకు భిన్నంగా రూ.4507కోట్లు రావ‌టం విశేషం. అంటే.. ఒక్క జులైలో వెయ్యి కోట్ల రూపాయిల మేర ఆదాయం ఒక్క‌సారిగా పెర‌గ‌టం జ‌రిగింది. ఈ ఆదాయం మొత్తం వాణిజ్య ప‌న్నుల కార‌ణంగా ఖ‌జానాకు చేరే మొత్తం.

అయితే.. గోదావ‌రి మ‌హాపుష్క‌రాల‌కు భారీగా భ‌క్తులు వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ పెరుగుద‌ల న‌మోదైందా? లేక‌.. మ‌రే కార‌ణమైనా ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆగ‌స్టు నెల ఆదాయాన్ని అనుస‌రించి.. ఈ పెరుగుద‌ల తాత్క‌లికమా.. శాశ్వత‌మా అన్న‌ది తేలుతుంద‌ని చెబుతున్నారు. మొత్తంగా రెవెన్యూ వృద్ధి రేటు మిగిలిన ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే.. ఏపీలో ఎక్కువ‌గా ఉంద‌ని చెబుత‌న్నారు.

ఏపీలో వాణిజ్య ప‌న్నుల వృద్ధి రేటు 15.63 శాతం న‌మోదు చేసి ద‌క్షిణాదిన అగ్ర‌స్థానంలో నిలిస్తే.. తెలంగాణ‌లో మాత్రం 6.03 శాతం మాత్ర‌మే న‌మోదు అయిన‌ట్లు చెబుతున్నారు. రెవెన్యూ లోటు భారీగా ఉన్న నేప‌థ్యంలో.. వాణిజ్య‌ప‌న్నుల ఆదాయ వృద్ధి రేటు ఏపీకి ఒక శుభ‌సూచ‌కంగా చెప్పాలి.
Tags:    

Similar News