ఆన్ లైన్ రమ్మీపై ఉక్కుపాదం మోపనున్న జగన్ సర్కార్ !

Update: 2020-08-31 11:30 GMT
ఏపీలో అధికారం చెప్పటినప్పటి నుండి ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ రమ్మీ తో మధ్య చాలామంది డబ్బులు పోగొట్టుకొని, సైబర్ మోసాల్లో పడుతున్న నేపథ్యంలో ఆన్లైన్ రమ్మీ పై నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్ రమ్మీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సదరు సంస్థలపై సంచలన నిర్ణయం తీసుకోబోతుంది.

ఈ మధ్య కాలంలో కృష్ణాజిల్లా నూజివీడులో ఒక బ్యాంకు ఉద్యోగి కోటికిపైగా మోసం చేసి ఐపీ పెట్టారు. ఇంతకీ బ్యాంకు ఉద్యోగి కోటి రూపాయలకు పైగా డబ్బులు ఏం చేశారన్నది ఆరా తీస్తే ఆయన ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్టుగా పోలిసుల విచారణ లో వెలుగులోకి వచ్చింది. . ఈ తరహా మోసాలు ఏపీలో విపరీతంగా జరిగాయంటే ఆన్లైన్ రమ్మీ ఎంత వ్యసనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం పక్క స్కెచ్ వేస్తుంది. ఆన్లైన్ రమ్మీతో మోసపోయిన వారు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సైతం ఆన్లైన్ రమ్మి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరుతో ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సాగుతోంది. ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఆన్లైన్ రమ్మీతో వందల కోట్లు గ్యాంబ్లింగ్ మాయలో పడి పోగొట్టుకుంటున్నారు. మొదట్లో ఆన్లైన్ రమ్మీలోకి దిగిన వారు ఆటల్లో గెలుస్తారు. దాంతో వారికి డబ్బు ఆశ చూపించి, ఆ తర్వాత క్రమంగా వారి డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమం ఆన్లైన్ రమ్మి ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధిస్తూ త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News