పంటల భీమా పథకానికి వైఎస్సార్ పేరు

Update: 2020-11-03 15:10 GMT
ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత పంటల భీమా పథకానికి వైఎస్సార్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గానూ పంటల భీమా పథకానికి వైఎస్ ఆర్ పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పొందుపరిచింది.

2019-20 సంవత్సరంలో రబీ సీజన్, అలాగే 2020 ఖరీఫ్ పంటకు పంటల భీమా పథకం వర్తింప చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఉచిత పంటల భీమా అమలవుతోంది. కాగా దివంగత ముఖ్యమంత్రి, వైఎస్సార్ జయంతి ని జగన్ సర్కార్ రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతేడాది జూలై 8 రైతు దినోత్సవం జరపాలని గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఈ ఉచిత పంటల భీమా పధకం అమలు కానుంది.
Tags:    

Similar News