ఏపీ అధికార పార్టీలో మూడు రాజధానుల అంశంపై తర్జన భర్జన సాగుతోంది. పార్టీ అధినేత, సీఎంను మెప్పించేందుకు.. ఉత్తరాంధ్ర నాయకులు. మంత్రులు.. విశాఖలో రాజధాని కావాలని.. ఇక్కడే రాజధాని ఏర్పడాలని.. ఇటీవల గొంతు చించుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్ర 2.0పై తీవ్ర విమర్శలుకూడా చేశారు. ఆ వెంటనే గర్జనకు కూడా.. శ్రీకారం చుట్టారు. విశాఖలో కొందరిని పోగేసి.. మంత్రులు.. నాయకులు.. గర్జన పేరిట హడావుడి చేశారు. సరే.. వారి ప్రాంతంపై వారికి మక్కువ ఉండొచ్చు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏపీ ఎప్పుడో ప్రాంతాల వారీగా విడిపోయింది. ఇది గతం నుంచి వినిపిస్తున్న మాటే!.
సో.. విశాఖ కోసం.. ఇంతగా గర్జన చేసిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడ? అని ప్రశ్నించుకుంటే.. ఎవరి మానాన వారు ఉన్నారు. ఎవరి వ్యాపారాలువారు చేసుకుంటున్నారు. దీనికి కారణం.. అమరావతి రాజ.ధాని రైతులు.. తమ పాదయాత్ర ఆపివేయడమే. రైతులు పాదయాత్ర చేసిన సమయంలోనే ఇక్కడి నాయకులకు.. విశాఖను రాజధాని చేయాలనే డిమాండ్ కనిపిస్తోంది. వినిపిస్తోందన్నమాట. నిజానికి రైతులు పాదయాత్ర చేస్తున్నారంటే. ఒక అర్ధం ఉంది.
వారు ఇక్కడ రాజధాని కోసం.. భూములు ఇచ్చారు. సో.. తమ ప్రాంతంలో తమ జీవనోపాధిని కాదని... భూములు ఇచ్చారు కనుక.. రైతులు. ఇలా కోరడంలో తప్పులేదు. కానీ.. వైసీపీనాయకులు.. రాజధాని కోసం ఏం చేశారు?
పోనీ.. ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తున్నాను.. మీరు ఓ 100 ఎకరాలు.. మీ సొంత సొమ్ముతో కొని ఇవ్వగలరా..అంటే.. ముందుకు వచ్చే నాయకులు ఉన్నారా? పోనీ.. కీలక వైసీపీ నాయకుడు.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఉన్న.. భారీ కళాశాల భూముల్లో ఒక్క ఎకరం..ఉదారంగా కాకపోయినా.. ప్రభుత్వం చెప్పిన ధరలకు.. లేదా.. ల్యాండ్ పూలింగ్ ప్రకారం.. ఇవ్వగలరా? ఇదిసాధ్యం కాదు. పోనీ.. విశాఖఎంపీ.. ఎంవీవీ సత్యనారాయణకు ఉన్న 50 ఎకరాల్లో ఒక అర ఎకరం ఇవ్వగలరా? ఇదీ కుదరదు. కానీ, వీరికి మాత్రం రాజధాని కావాలి. ఎందుకంటే.. వారి వారి భూముల ధరలు పెరిగిపోయి.. వ్యాపారాలు సమృద్ధిగా ముందుకు సాగాలి. ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్న చర్చ.
ఎందుకంటే.. గర్జన తో ఘీంకరించిన నాయకులు. ఇప్పుడు ఇళ్లలో పడుకున్నారు. కనీసం.. ఈ మాట కూడా ఎత్తడంలేదు. పోనీ.. రాజీనామా చేయాలని అనుకున్న ధర్మాన.. దీనికి సీఎం అనుమతి ఎందుకు? అంటే.. సమాధానం చెప్పరు. మరి దీనిన ఏమనుకోవాలి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వైట్ పేపర్‌పై సంతకం పెట్టి ఇదే నా రాజీనామా పో! అన్నట్టు వ్యవహరించారు.
ఇవన్నీ.. ఎవరికి అర్ధం కావని అనుకుంటున్నారో.. లేక తాము ఏం చేసినా..ప్రజలు గమనించరని భావిస్తున్నారో.. తెలియదు కానీ.. వారు చేస్తున్న విఅన్నీ వివాదమే అవుతున్నాయి. మరి ఇక, గర్జన ఎక్కడ.. ? అనేది ప్రశ్న. ఏదేమైనా.. రాజధానిని తొక్కేయడం తేలిక. కానీ, దానికోసం.. కష్టపడడమే కష్టం..!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.