తెలంగాణ ప్రభుత్వం ఏపీ సీఎం, మంత్రులు,అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడం నిజమేననితేలింది. సర్వీసు ప్రొవైడర్లు ఈ సంగతిని బయటపెట్టారు. మే, జూన్ నెలల్లో ఏపీ ప్రభుత్వవర్గాలకు చెందినవారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు మూడు టెలికాం కంపెనీలు అంగీకరించాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదేశలతోనే ఈ పనిచేసినట్లువారు చెప్పారు. ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఎయిర్ టెల్, రిలయస్స్, ఐడియా ఫోన్లు వాడుతున్నవారి ఫోన్లు ట్యాపింగుకు గురయ్యాయట. చట్టబద్ధంగా ఫోన్ట్యాపింగు చేయడానికి అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తమను ఆదేశించడంతోనే ఈపనికి పాల్పడినట్లు ఈ మూడు సంస్థలు తాజాగాసుప్రీంకోర్టుకు చెప్పాయి. ఓటుకు నోటుకు కేసులోసంప్రదింపులు... రేవంత్, చంద్రబాబులువిగా చెబుతున్న వాయిస్ రికార్డులు అన్నీ మే, జూన్ లోట్యాప్ చేసినవేనట. దీని ప్రకారం చంద్రబాబు ఇంతవరకు చెబుతున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ నిజమని తేలిపోయింది. దీంతోముందుగా ట్యాప్ చేసి.. ఆ తరువాత రేవంత్ ను ఏసీబీ అధికారుల ట్రాప్ లో పడేలా చేశారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక 'టైమ్స్ అఫ్ ఇండియా'లో ఈ వార్త ప్రచురితమైంది.
అయితే... ప్రభుత్వం ఆదేశించడంతో ట్యాపింగ్ చేశామని చెబుతున్న ఈ సంస్థలు ఆసంభాషణల్లో సమాచారం మాత్రం తమకుతెలియదని కోర్టుకు తెలిపాయి. కాగా ఫోన్ట్యాపింగు చేసినట్లుగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం తమను కొన్ని వివరాలు అడిగిందని... ఆ సమాచారం వారికి ఇవ్వాలో వద్దోనిర్ణయించుకునేలోగానే తెలంగాణ ప్రభుత్వం తమను హెచ్చరించిందని.. ఆ సమాచారం ఆంధ్రప్రదేశ్ కు ఇస్తే ఆఫీస్ రహస్యాల చట్టం, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం తమపై చర్యలుతీసుకుంటామని బెదిరించడంతో ఏపీ కోరిన సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఇదంతా ఎలాఉన్నా సెల్ కంపెనీల తాజా పిటిషన్ తో తెలంగాణ ప్రభుత్వం చేసిన యవ్వారమంతా బయటపడింది. ట్యాపింగ్ చేయడమే కాకుండా అది తెలుసుకున్నఏపీ ప్రభుత్వం వివరాలు అడిగినా ఇవ్వొద్దని బెదిరించడానికి కూడా తెగబడ్డారని తేలింది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో...కేంద్ర హోం శాఖ దీనిపై ఏమంటుందో... ఏపీ ప్రభుత్వం ఎలా ప్రొసీడవుతుందో చూడాలి..మొత్తానికి రెండు మూడు రోజుల్లో దీనిపై మళ్లీరాజకీయం వేడెక్కడం ఖాయం.