ఆంధ్రప్రదేశ్ నంబర్ 1.. నేరాల్లో

Update: 2016-12-26 21:30 GMT
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడితే చాలు రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలుపుతాను.. దేశంలోనే అగ్రగామిగా మారుస్తానని అంటారు. కానీ.. ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారో కానీ.. అభివృద్ధిలో రోజురోజుకూ వెనక్కుపోతూ అవినీతిలో మాత్రం ఇప్పటికే ఏపీ నంబర్ 1గా నిలిచింది. తాజాగా మరో అంశంలోనూ నంబర్ 1 అయింది.. ఈసారి నేరాల్లో ఏపీకి నంబర్ 1 ప్లేస్ దక్కింది.
    
ఇప్పటికే అవినీతిలో నెంబర్‌ వన్‌ గా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ గుర్తించింది. తాజాగా నేరాల విషయంలో నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్ బ్యూరో కూడా ఏపీకి నెంబర్‌ వన్‌ స్థానం ఇచ్చింది.  నేరాల విషయంలో టీడీపీ దాని అనుకూల మీడియా పదేపదే రాయలసీమ మీద నిందలేస్తున్న నేపథ్యంలో… నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మాత్రం చంద్రబాబు రాజ్యమేలుతున్న విజయవాడలోనే క్రైమ్ రేటు అధికంగా ఉందని తేల్చింది.  దేశంలోనే దళితులపై అత్యధిక స్థాయిలో దాడులు జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.  
    
మహిళలపై దాడుల విషయంలోనూ తక్కువేం కాదు.. మనది నాలుగో ర్యాంకు.  మహిళలపై దాడుల విషయంలో మొత్తం 15,931 కేసులు న‌మోద‌యిన‌ట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. జాతీయ స‌గ‌టు కంటే ఏపీలోనే 10శాతం ఎక్కువ. సైబర్‌ నేరాల విషయంలో ఏకంగా గతేడాదితో పోలిస్తే 100 శాతం పెరిగాయి. మొత్తానికి చంద్రబాబు పాలనలో ఏపీలో అన్నిరకాల క్రైమ్ రేట్ బాగా పెరిగిపోంది. దీంతో.. ఆయన చెబుతున్న రెండంకెల వృద్ధి ఇదేనేమో అంటున్నాయి విపక్షాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News