ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సచివాలయం రెఢీ అవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చూస్తూ.. జూన్ మూడో వారం నాటికి సచివాలయం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. హైదరాబాద్ లో పని చేస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని జూన్ మూడో వారం నాటికి అమరావతికి తరలించేందుకు ఏపీ సర్కారు కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే.
నెలల ముందే ఉద్యోగుల తరలింపుపై స్పష్టమైన ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వానికి తగ్గట్లే.. ఏపీ ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఏళ్ల తరబడి హైదరాబాద్ లో పని చేస్తున్న వారు.. అమరావతికి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు తాము అమరావతికి వెళ్లటానికి సిద్ధమైనట్లుగా ప్రకటించారు.
త్వరలో తాము రాజధానిలో నిర్మిస్తున్న సచివాలయాన్ని సందర్శించి.. అక్కడి సౌకర్యాల్ని పరిశీలించనున్నట్లుగా ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సత్య సులోచన చెబుతున్నారు. ఏపీ సర్కారు తీసుకునే ఏ నిర్ణయానికి అయినా తమ మద్దతు ఉంటుందని.. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని చెబుతున్నారు. సో.. అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ సచివాలయానికి తరలి వెళ్లేందుకు సర్వం సన్నద్ధమవుతున్నట్లేనన్న మాట.